ఒత్తిడి - ఆందోళనకు చికిత్స ఎలా..?

షేర్ చేయండి:
 ఒత్తిడి - ఆందోళనకు చికిత్స ఎలా..?

సాక్షి లైఫ్ : ఈ రోజుల్లో ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు జీవితంలో భాగమయ్యాయి. ఏ పని చేయాలన్నా ఒత్తిడి మాత్రం తప్పడం లేదు. కొంతమంది నిరంతరం ఆందోళన, ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీంతో నిత్యం చేసే పనుల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. 

అటువంటి పరిస్థితిలో ఆందోళన అనేది ఓ తీవ్రమైన అనారోగ్య సమస్యగా మారుతోంది. ప్రస్తుత తరంలో ఈ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 70 లక్షల మంది ఆందోళన బారిన పడుతున్నారు. 

ఆందోళన రుగ్మతకు చికిత్స సాధ్యమే, కానీ ఈ సమస్య పరిష్కారం కోసం ఎవరిని కలవాలో తెలియడం లేదు కొందరికి, యాంగ్జైటీ డిజార్డర్ కు ఎవరి దగ్గర చికిత్స తీసుకోవాలంటే..?  
 
 యాంగ్జైటీ డిజార్డర్ కు పరిష్కారం..?
 
రెగ్యులర్ గా హెల్త్ చెకప్‌లు చేసే డాక్టర్ ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలను ముందుగా గుర్తించగలరు. కొన్ని రకాల చికిత్స కోసం వారు మానసిక నిపుణుల వద్దకు వెళ్ళమని సూచిస్తారు.

మనస్తత్వవేత్త.. 

మనస్తత్వవేత్తలు అంటే సైకాలజిస్టులు అని, వీరినే మానసిక ఆరోగ్య సంరక్షణ నిపుణులు అని కూడా అంటారు. వారు ఆందోళన, ఒత్తిడి  నుంచి అవసరమైన చికిత్సను అందిస్తారు.

మానసిక వైద్యుడు..  

మనోరోగ వైద్యులు అంటే మెడికల్ డాక్టర్స్. (MDలు) వీరు మానసిక సమస్యలకు చికిత్స చేస్తారు. మనస్తత్వవేత్తలు, మనోరోగ వైద్యుల మధ్య అతిపెద్ద వ్యత్యాసం వారు మానసిక సమస్యలకు చికిత్స చేసే విధానంలో ఉంది. 

మనస్తత్వవేత్తలు ఈ పరిస్థితులను మానవ ప్రవర్తన ఆధారంగా చూస్తారు. అయితే మానసిక వైద్యులు జీవ, రసాయన మార్పులపై దృష్టి పెడతారు.

వైద్యుడిని సందర్శించే ముందు ఏమి చేయాలి..?  
 
ప్రశ్నలను ముందుగానే రాసుకోవాలి.

ఏ మందులు తీసుకుంటున్నారో తెలుసుకోవాలి.

మెడికల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీను కూడా గమనించాలి.

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.