సాక్షి లైఫ్ : నేటి ఆధునిక జీవనశైలిలో వెన్నునొప్పి (Back Pain), చెడు భంగిమ (Poor Posture)టెక్ నెక్ (Tech Neck) వంటి సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం, మెడ వంచి మొబైల్ చూడటం వంటి భౌతిక కారణాలే వీటికి మూలంగా భావిస్తాం. అయితే, మన శరీరానికి మద్దతు ఇవ్వడంలో భావోద్వేగాల పాత్ర చాలా కీలకం. మీ వెన్నునొప్పికి కారణం కేవలం కూర్చునే విధానం కాకపోవచ్చని, మీ మానసిక ఒత్తిడి (Mental Stress), ఆందోళన (Anxiety) కూడా కావచ్చు అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఒత్తిడితో కండరాలు(The Stress-Muscle Connection)..
మానసిక ఒత్తిడి, వెన్నునొప్పి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పోరాడు-లేదా-పారిపో (Fight-or-Flight).. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఆందోళన చెందినప్పుడు, మీ శరీరం సహజంగానే 'పోరాడు-లేదా-పారిపో' (Fight-or-Flight) ప్రతిస్పందనను ప్రారంభిస్తుంది. ఇది కార్టిసాల్ (Cortisol) వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది.
ఈ హార్మోన్లు విడుదలైనప్పుడు, శరీరం రక్షణ కోసం సిద్ధమవుతూ, మెడ, భుజాలు దిగువ వెనుక భాగంలోని కండరాలు (Lower Back Muscles) బిగుసుకుపోతాయి (Tighten Up). దీర్ఘకాలిక ఒత్తిడి ఉన్నప్పుడు ఈ కండరాల బిగుసుకుపోవడం (Tension) అలాగే ఉండిపోయి, నిరంతర నొప్పి, దృఢత్వానికి దారి తీస్తుంది. అంతేకాకుండా, అధిక ఒత్తిడి నొప్పిని గుర్తించే మీ మెదడు సామర్థ్యాన్ని (Pain Perception) పెంచుతుంది. చిన్న నొప్పి కూడా మీకు తీవ్రంగా అనిపించేలా చేస్తుంది, ఇది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది.
ఆ భంగిమకు ఒత్తిడే కారణం..
మీరు బాధగా లేదా నిరాశగా ఉన్నప్పుడు, మీ భంగిమ (Posture) అసంకల్పితంగా మారుతుంది. ఒత్తిడిలో ఉన్నవారు తరచుగా భుజాలు వంచి (Hunched Shoulders), ముందుకు వంగి కూర్చుంటారు. ఇది వెన్నెముకపై, ముఖ్యంగా మెడ, వెన్ను పైభాగంలో అధిక భారాన్ని పెంచుతుంది.
ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడేవారు వ్యాయామం మానేసి, ఎక్కువ సమయం నిశ్చలంగా (Inactive) కూర్చోవడం లేదా పడుకోవడం చేస్తారు. దీనివల్ల వెన్నుకు మద్దతు ఇచ్చే కండరాలు (Core Muscles) బలహీనపడి, నొప్పి మరింతగా పెరుగుతుంది.
పరిష్కారం ఏమిటి..?
వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం కావాలంటే, భౌతిక చికిత్సతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. మైండ్‌ఫుల్‌నెస్ (Mindfulness): యోగ (Yoga)ధ్యానం (Meditation) వంటివి చేయడం ద్వారా ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఇది కండరాల ఉద్రిక్తతను తగ్గిస్తుంది.
సరైన భంగిమలో కూర్చోవడం చాలా ముఖ్యం.. అంతేకాదు పనిచేసేటప్పుడు ఎర్గోనామిక్ కుర్చీలు వాడటం, ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి నడవడం, సాగదీయడం (Stretching) వంటివి చేయాలి.
ఒత్తిడి వల్ల వచ్చే నిద్రలేమి (Insomnia) నొప్పిని పెంచుతుంది. కాబట్టి నాణ్యమైన నిద్ర అవసరం. నొప్పి దీర్ఘకాలికంగా ఉంటే, కేవలం ఫిజియోథెరపిస్ట్ నే కాకుండా, మానసిక ఆరోగ్య నిపుణులను (Counsellor/Psychologist) కూడా సంప్రదించడం మంచిది.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com