New Rules for Digital Platforms : మెంటల్ హెల్త్ సేఫ్టీ కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కు కొత్త చట్టం..
సాక్షి లైఫ్ : చిన్నారులు, యువత మానసిక ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ఉండే హెచ్చరికల తరహాలోనే, ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా వినియోగదారులను అప్రమత్తం చేయాల్సి ఉంటుందని న్యూయార్క్ కొత్త చట్టం చెబుతోంది. పెద్దా, చిన్నా అనే తేడాల్లేకుండా అందరిపై మానసికరుగ్మతలకు సోషల్ మీడియానే ప్రధాన కారణమవుతోంది.
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఈ క్రమంలో అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తమ యాప్‌లపై 'మానసిక ఆరోగ్య ముప్పు' హెచ్చరిక లేబుళ్లను (Health Warning Labels) ప్రదర్శించడం తప్పనిసరి చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ ఇటీవల ఈ చట్టంపై సంతకం చేశారు. కాలిఫోర్నియా, మిన్నెసోటా వంటి రాష్ట్రాల బాటలోనే న్యూయార్క్ కూడా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
ఏమిటీ కొత్త నిబంధనలుఅంటే..?
సోషల్ మీడియాలోని కొన్ని ప్రత్యేక ఫీచర్లు యువతను వ్యసనపరులుగా మారుస్తున్నాయని, తద్వారా వారిలో ఆందోళన (Anxiety), నిరాశ (Depression) పెరుగుతున్నాయని నిపుణులు తేల్చారు.
అడిక్టివ్ ఫీచర్స్.. ఇన్‌ఫినిట్ స్క్రోలింగ్ అంటే ముగింపు లేని ఫీడ్, ఆటో-ప్లే వీడియోలు, అల్గారిథమిక్ ఫీడ్‌లు ఉన్న ప్లాట్‌ఫామ్స్ కచ్చితంగా హెచ్చరికలను ప్రదర్శించాలి.హెచ్చరిక తప్పనిసరి.. యాప్‌లోకి లాగిన్ అయినప్పుడు, వినియోగిస్తున్నప్పుడు నిర్ణీత కాలవ్యవధిలో ఈ హెచ్చరికలు స్క్రీన్ పై కనిపించాలి. వినియోగదారులు వీటిని దాటవేసే (Bypass) అవకాశం ఉండదు. భారీ జరిమానాలు.. ఈ నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై ఒక్కో ఉల్లంఘనకు 5,000 డాలర్ల అంటే సుమారు రూ. 4.2 లక్షలు వరకు జరిమానా విధించే అధికారం అటార్నీ జనరల్‌కు ఉంటుంది.
ఎందుకు ఈ హెచ్చరికలు..?
యూఎస్ సర్జన్ జనరల్ డా. వివేక్ మూర్తి గతంలోనే సోషల్ మీడియాను "పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ"గా అభివర్ణించారు. నిత్యం మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడిపే టీనేజర్లలో మానసిక సమస్యలు వచ్చే అవకాశం రెట్టింపు అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
నిపుణులు సూచిస్తున్న ఆరోగ్య సూత్రాలు..
డిజిటల్ డెటాక్స్..రోజులో కనీసం గంట లేదా రెండు గంటల పాటు మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉండాలి. పడుకోవడానికి గంట ముందు స్క్రీన్ చూడటం ఆపేయాలి. తద్వారా నిద్ర నాణ్యత పెరుగుతుంది. సోషల్ మీడియాను వినియోగించే పిల్లలుపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలి.
వర్చువల్ ప్రపంచం కంటే స్నేహితులు, కుటుంబ సభ్యులతో నేరుగా గడపడానికి ప్రయత్నించాలి. సోషల్ మీడియా అనేది సమాచార మార్పిడికి సాధనం మాత్రమే, అది మీ జీవితాన్ని శాసించే వ్యసనం కాకూడదు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే నిపుణులైన సైకాలజిస్టులను సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
