oneirology : ఒనిరియాలజీ అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్ : పలు నివేదికలు ప్రకారం, కలలు, వాటికి మనిషికి ఉన్న సంబంధం, శాస్త్రీయ ఆధారాలు, ఆలోచనల పాత్ర వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలపై మానసిక నిపుణులు వివరించారు. మనిషి ఎక్కువగా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడో, వాటికి సంబంధించిన కలలే వస్తాయి. కలలకు ప్రాణం పోసేది మనస్సే. మనస్సులో వచ్చే ఊహలు, ఆలోచనలే కలలకు జీవం పోస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఉదాహరణకు, ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్నవారికి గుళ్లు, గోపురాలు దర్శించడం, పూజలు చేయడం వంటి దైవ చింతనకు సంబంధించిన కలలే ఎక్కువగా వస్తాయి. నిజ జీవితంలో సాధ్యం కాని తీర్థయాత్రల దర్శనం కూడా స్వప్నావస్థలో సాధ్యమవుతుంది. అంతేకాదు, ఆ పుణ్యక్షేత్రాల్లోని పరిసరాలు, ప్రకృతిని యథాతథంగా చూసిన అనుభూతి కూడా కలుగుతుందని సైకాలజిస్టులు వెల్లడిస్తున్నారు.
కొంతమందిలో రాత్రికి దాదాపు రెండు గంటల పాటు కూడా కలలు వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. మరికొందరిలో అయితే ఒక్కో కల ఐదు నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఉంటుందని మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు.
రాపిడ్ ఐ మూవ్‌మెంట్ (REM) - కలల దశ..
కలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని "ఒనిరియాలజీ" అంటారు. నిద్రలో కలలు వచ్చే స్థితిని ఆంగ్లంలో "రాపిడ్ ఐ మూవ్‌మెంట్ (REM)" అని అంటారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కనుగుడ్లు వేగంగా కదులుతూ ఉంటాయి. అందుకే కలలను "రాపిడ్ ఐ మూవ్‌మెంట్" గా వ్యవహరిస్తారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
