పాప్‌కార్న్ బ్రెయిన్ అంటే..? దీనివల్ల ఏమైనా ఇబ్బందా..?
సాక్షి లైఫ్ : ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకూ ఉరుకులు, పరుకుల జీవితం. దీంతో ఒత్తిడి పెరిగి అనేక మానసిక సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ను ఫాలో అయ్యేవాళ్ళు నిరంతరం స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. అంతేకాదు ఫేస్ బుక్ లో ఫ్రెండ్ ఏమేం పోస్ట్ చేశాడో..? ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయో అన్న ఆలోచనలతో సోషల్ మీడియానే ఒక ప్రపంచంగా భావించి అచంచలమైన ఆలోచనలు కలిగి ఉండడాన్నే " పాప్‌కార్న్ బ్రెయిన్" అంటారు.
ఇది కూడా చదవండి.. బ్లూ టీ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
పాప్‌కార్న్ బ్రెయిన్ అంటే..?
పాప్ కార్న్ తయారు చేసేటప్పుడు ఎలాగైతే మొక్కజొన్న గింజలు పేలిపోతూ అటూ, ఇటూ పడుతుంటాయో.. అదేవిధంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్ల ఆలోచనలు ఉంటాయని అందుకే వీరి ఆలోచనలకు తగినట్లుగా " పాప్‌కార్న్ బ్రెయిన్" అని పేరు పెట్టారు.
పాప్‌కార్న్ బ్రెయిన్ ఈ రోజుల్లో చాలా మందిని ప్రభావితం చేసే ఈ సమస్యలలో ఒకటి. పాప్‌కార్న్ బ్రెయిన్ ఇటీవలి కాలంలో కొత్త పదంగా ఉద్భవించింది. ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి నిరంతరం మనస్సులోకి వచ్చే పరిస్థితిని "పాప్ కార్న్ బ్రెయిన్" అంటారు. దీని కారణంగా ఒత్తిడి, ఆందోళన పెరిగి ఉత్పాదక తగ్గుతుంది. అంతేకాదు ఈ పరిస్థితి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా దెబ్బతీస్తుంది.
ఉత్పాదకత తగ్గుతుంది..
ఆందోళన పెరిగి ఉత్పాదకత కూడా తగ్గుతుంది. ఏకాగ్రత ఒకదానిపై నిలపలేరు. దేనిమీద సరిగా మనసు నిలపలేక పోవడం వల్ల మానసిక సమస్యలు తలెత్తుతాయి. తద్వారా సరిగా నిద్ర పట్టదు. ఈ ప్రభావంతో పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే సోషల్ మీడియాకు స్మార్ట్ ఫోన్లను పరిమితంగా వాడాలని మానసికశాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. మంచూరియా, పీచు మిఠాయిల అమ్మకాలను నిషేధించిన రాష్ట్రం ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
