మానసిక ఆరోగ్యంపై వాయు కాలుష్య ప్రభావం.. ఎంతంటే..? 

షేర్ చేయండి:
 మానసిక ఆరోగ్యంపై వాయు కాలుష్య ప్రభావం.. ఎంతంటే..? 

సాక్షి లైఫ్ : వాయు కాలుష్యం పెరగడం వల్ల మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది. పొల్యూషన్ ఎఫెక్ట్ నిద్రపై పడడంవల్ల జ్ఞాపకశక్తి,కిడ్నీలు,లివర్ హెల్త్ తీవ్రంగా  దెబ్బతింటోందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

పచ్చదనం తగ్గడంతో..

పచ్చదనం తగ్గడంతోపాటు వాహనాల కాలుష్యం పెరగడంతో ఇప్పటికే ఢిల్లీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా పెరుగుతున్న వాయు కాలుష్యం మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా క్షీణింపజేస్తోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

అధ్యయనంలో.. 

అమెరికాలోని వర్జీనియాలో ఉన్న అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో గాలిలో పీఎం2.5 ఒక శాతం పెరిగితే మానసిక అనారోగ్యం వచ్చే ప్రమాదం 10.3శాతం పెరుగుతుందని గుర్తించారు.

 పీఎం 2.5 గాలిలో ఒక శాతం పెరిగితే, ఈ గాలిని ఎక్కువసేపు పీల్చుకుంటే, మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అమెరికాలోని వర్జీనియాలోని అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ పరిశోధకులు తమ అధ్యయనంలో కనుగొన్నారు. 

పీఎం 2.5 గాలిలో ఒక క్యూబిక్ మీటరుకు ఒక మైక్రోగ్రామ్ పెరిగితే, మీరు డిప్రెషన్ లేదా విచారంగా భావించే అవకాశాలు 1.49 శాతం పెరుగుతాయని రీసెర్చ్ లో తేలింది.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.