విటమిన్-డి కు, మెదడుకు ఉన్న లింక్ ఏంటి..?
సాక్షి లైఫ్ : విటమిన్-డి లోపం కేవలం ఎముకల బలహీనతకు మాత్రమే కారణమవుతుందని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్టే! శరీరంలో విటమిన్-డి లోపిస్తే అది మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. "డి" లోపం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని వారు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. పిల్లల్లో ఈ 5 లక్షణాలు కనిపిస్తే విటమిన్-డి లోపమే..!
ఇది కూడా చదవండి.. లేట్ నైట్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఎందుకు..?
ఇది కూడా చదవండి.. వంట నూనెకు చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి లింక్ ఏంటి..?
మెదడు ఆరోగ్యానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి విటమిన్-డి చాలా అవసరం. విటమిన్-డి లోపం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. విటమిన్-డి మన మెదడులోని న్యూరాన్ల పనితీరుకు సహాయపడుతుంది. మెదడులోని కొన్ని భాగాలలో విటమిన్-డి గ్రాహకాలు ఉంటాయి. ఇవి సెరటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్ల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. ఈ హార్మోన్లు మన మూడ్, భావోద్వేగాలను నియంత్రిస్తాయి.
విటమిన్-డి మెదడులో న్యూరోప్రొటెక్టివ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పాత్రను పోషిస్తుంది. ఇది సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి, న్యూరాన్‌ల మధ్య కనెక్షన్‌ను మెరుగుపరుస్తుంది. విటమిన్-డి లోపం డిమెన్షియా, డిప్రెషన్, ఆటిజం, స్కిజోఫ్రెనియా వంటి మానసిక సమస్యలకు కారణం కావచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
