for Strong Bones : ఈ ఏడు రకాల ఆహారాలు తీసుకుంటే ఎముకల పుష్టికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డిని పుష్కలంగా పొందవచ్చు..
సాక్షి లైఫ్ : ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం ఉండాల్సిందే! అనగానే మనందరికీ గుర్తొచ్చేది 'పాలు'. అయితే, లాక్టోస్ అసహనం ఉన్నవారికో లేదా పాలు, పెరుగు వాసన పడని వారికో కాల్షియం ఎలా అందుతుంది..? అనే ఆందోళన అవసరం లేదు. పాలు తాగకపో యినా.. మన వంటగదిలో ఉండే కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా ఎముకల పుష్టికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, విటమిన్-డిని పుష్కలంగా పొందవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
1. ఆకు కూరలు..
పాలకూర, బ్రోకలీ, కేల్ వంటి ఆకుకూరలు కాల్షియం నిధులు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. వయసు మళ్లిన తర్వాత వేధించే 'ఆస్టియోపొరోసిస్' అంటే ఎముకలు గుల్లబారడం ప్రమాదాన్ని ఇవి తగ్గిస్తాయి.
2. బాదం..
బాదంలో కాల్షియంతో పాటు మెగ్నీషియం, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చడమే కాకుండా కండరాల పెరుగుదలకు తోడ్పడతాయి. రోజుకు కొన్ని బాదం పప్పులు నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.
3. చియా గింజలు..
చియా గింజలు పరిమాణంలో చిన్నవైనా, పోషకాల్లో మాత్రం అగ్రగామి. వీటిలో కాల్షియం, ఫైబర్,ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అటు ఎముకల ఆరోగ్యానికి, ఇటు గుండె పటిష్టతకు సహాయపడతాయి.
4. నువ్వులు..
మన పూర్వీకులు నువ్వుల లడ్డూలు తినమని చెప్పడంలో అర్థం ఇదే! నువ్వులు కాల్షియం, ఫాస్ఫరస్‌కు ప్రధాన వనరులు. ఇవి దంతాలను, ఎముకలను వజ్రంలా బలోపేతం చేస్తాయి.
5. సోయా ఉత్పత్తులు..
పాలకు ప్రత్యామ్నాయంగా సోయా పాలు, సోయా పనీర్ అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా శాకాహారులకు, పాల ఉత్పత్తులు పడని వారికి ఇది ఒక గొప్ప పోషకాహార మార్గం.
6. నారింజ..
నారింజలో కేవలం విటమిన్ సి మాత్రమే కాదు, కాల్షియం కూడా ఉంటుంది. విటమిన్-సి ఎముకల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తే, కాల్షియం వాటికి దృఢత్వాన్ని ఇస్తుంది.
7. అంజీర్ పండ్లు..
ఎండిన అంజీర్ పండ్లలో కాల్షియం, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఎముక విరిగే ప్రమాదాన్ని తగ్గించడంలోనూ, ఎముకల సాంద్రతను కాపాడటంలోనూ అంజీర్ మేటిగా పనిచేస్తుంది. కాల్షియం శరీరానికి అబ్బాలంటే విటమిన్ డి కూడా అవసరం. అందుకే ఈ ఆహారంతో పాటు రోజూ కాసేపు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
