Main Causes of Migraine : మైగ్రేన్ కు ప్రధాన కారణాలు ఈ చిన్న పొరపాట్లే.. 

షేర్ చేయండి:
Main Causes of Migraine : మైగ్రేన్ కు ప్రధాన కారణాలు ఈ చిన్న పొరపాట్లే.. 

సాక్షి లైఫ్ : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మైగ్రేన్ (Migraine) పార్శ్వపు తలనొప్పి అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది. ఇది కేవలం తలనొప్పి మాత్రమే కాదు.. వాంతులు, వికారం, వెలుతురును చూడలేకపోవడం వంటి లక్షణాలతో మనిషిని కుంగదీస్తుంది. అయితే, మనం అనుకోకుండా చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఈ నొప్పిని మరింత తీవ్రం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

భోజనం మానేస్తున్నారా..?

 పని ఒత్తిడిలో పడి చాలామంది ఉదయం అల్పాహారం లేదా మధ్యాహ్నం భోజనం మానేస్తుంటారు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు (Blood Sugar Levels) తగ్గిపోతాయి. ఫలితంగా మెదడుకు శక్తి అందక మైగ్రేన్ నొప్పి ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. కాబట్టి, సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం మర్చిపోవద్దు.  మెదడు ఉత్తేజితంగా ఉండాలన్నా, విశ్రాంతి తీసుకోవాలన్నా సరైన నిద్ర తప్పనిసరి. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర లేకపోతే నరాలపై ఒత్తిడి పెరిగి మైగ్రేన్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది.

 స్క్రీన్ టైమ్.. 

 నిరంతరం మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చూడటం వల్ల వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది మెదడులోని నరాలను అతిగా ఉత్తేజపరిచి నొప్పిని పెంచుతుంది.

కెఫిన్ మోతాదు మించితే..

తలనొప్పిగా ఉందని పదే పదే కాఫీలు, టీలు తాగడం మంచిది కాదు. వీటిలోని కెఫిన్ రక్తనాళాలను ప్రభావితం చేసి, నొప్పి తగ్గకపోగా మరింత దీర్ఘకాలికంగా మారేలా చేస్తుంది.

మానసిక ఒత్తిడి.. 

కోపం, ఆందోళన, మానసిక ఒత్తిడి మైగ్రేన్‌కు ప్రధాన శత్రువులు. ఒత్తిడి పెరిగినప్పుడు మెదడులో విడుదలయ్యే రసాయనాలు నొప్పి తీవ్రతను రెట్టింపు చేస్తాయి.

ఉపశమనం కోసం ఏం చేయాలి..?

ద్రవ పదార్థాలు: డీహైడ్రేషన్ వల్ల కూడా తలనొప్పి వస్తుంది. కాబట్టి రోజువారీగా తగినంత నీరు, కొబ్బరి నీళ్లు లేదా పళ్ల రసాలు తీసుకోవాలి.

ధ్యానం,యోగా..

ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ కనీసం 15 నిమిషాల పాటు ప్రాణాయామం లేదా యోగా చేయడం వల్ల మైగ్రేన్ తీవ్రత తగ్గుతుంది. నొప్పి మొదలైనప్పుడు ప్రకాశవంతమైన వెలుతురుకు దూరంగా, ప్రశాంతంగా ఉన్న చీకటి గదిలో కాసేపు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. మీకు ఏ ఆహారం తిన్నప్పుడు లేదా ఏ సమయంలో నొప్పి వస్తుందో ఒక డైరీలో రాసుకోండి. దీనివల్ల మీకు మైగ్రేన్ కలిగించే ట్రిగ్గర్స్ (Triggers) ఏమిటో సులభంగా గుర్తించవచ్చు. మైగ్రేన్ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఉత్తమం.

 మైగ్రేన్‌ రాకుండా ఏమి చేయాలి..?

సమయానికి భోజనం చేయాలి..7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి..తగినంత నీరు తాగాలి.. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయాలి.. కాంతి, శబ్దానికి దూరంగా ఉండాలి..

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..New Guidelines : శరీరానికి అవసరమయ్యే నీటి పరిమాణంలో కొత్త మార్గదర్శకాలు..

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.