బాదంలో 15 ముఖ్యమైన పోషకాలు..   

షేర్ చేయండి:
బాదంలో 15 ముఖ్యమైన పోషకాలు..   

సాక్షి లైఫ్: కాలిఫోర్నియా ఆల్మండ్ బోర్డ్ ఆధ్వర్యంలో "రోజుకు ఒక గుప్పెడు బాదం పప్పులు: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి సహజ విధానం" అనే శీర్షికతో ఓ  ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో న్యూట్రిషన్ నిపుణురాలు షీలా కృష్ణస్వామి, ప్రముఖ భారతీయ మోడల్, అందాల పోటీ టైటిల్ విజేత, వ్యవస్థాపకురాలు పాల్గొని, సమతుల్య ఆహారం,బాదం వంటి సహజ ఆహారాల ప్రాముఖ్యతను వివరించారు. ఆర్‌జె సౌజన్య ఈ సదస్సుకు సంధానకర్తగా వ్యవహరించారు.

 

 

ది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..

 ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

 

నేటి ఉరుకులపరుగుల జీవితంలో మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయని, ఇవి భారత్‌లో ఏటా 6 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) హెచ్చరించింది. 2030 నాటికి ఈ వ్యాధులు దేశానికి 6 ట్రిలియన్ డాలర్ల నష్టం కలిగించవచ్చని అంచనా. దీనికి ప్రధాన కారణం అనారోగ్య కరమైన ఆహార ఎంపికలని నిపుణులు తెలిపారు.

ఈ సందర్భంగా షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, బాదంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ వంటి 15 ముఖ్యమైన పోషకాలు ఉన్నాయని, ఇవి రక్తంలో చక్కెర నియంత్రణ, బరువు నిర్వహణ, గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయని చెప్పారు. ప్రజ్ఞా అయ్యగారి తన బిజీ షెడ్యూల్‌లో బాదం, యోగా, ధ్యానం వంటివి చేర్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటానని పంచుకున్నారు.

కాలిఫోర్నియా ఆల్మండ్ బోర్డ్ నిర్వహించిన ఇటీవలి సర్వే ప్రకారం, భారత్‌లో బాదం అగ్రగామి శాఖాహార ప్రోటీన్ వనరులలో ఒకటిగా నిలిచింది. కాలిఫోర్నియాలోని ఆల్మండ్ బోర్డ్‌తో కలిసి ఇటీవల నిర్వహించిన యు గవ్ సర్వేను కూడా ఈ చర్చ లో ప్రస్తావించారు.

 భారతదేశంలోని అగ్రగామి 5 శాఖాహార ప్రోటీన్ వనరులలో బాదం స్థానం పొందిందని అది వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం, అన్ని ప్రాంతాలలో 10 మందిలో 6 గురు కంటే ఎక్కువ మంది బాదంను అధిక ప్రోటీన్ వనరుగా గుర్తిస్తున్నారు. 10 మందిలో 8 మందితాము ప్రతిరోజూ బాదంను తీసుకుంటామని చెప్పారు, ఈ చర్చ ఆరోగ్యకరమైన జీవనశైలికి బాదం వంటి సహజ ఆహారాల అవసరాన్ని గుర్తు చేసింది.

 

ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?

ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?

ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.