6 Essential Tests to Detect Cancer : క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించాలంటే ఈ 6 టెస్టులు తప్పనిసరి..
సాక్షి లైఫ్ : క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా (Early Detection) గుర్తిస్తే నయం చేయడం చాలా సులభం. కానీ చాలా మంది వ్యాధి ముదిరిన తర్వాత గానీ ఆసుపత్రికి వెళ్లడం లేదు. అందుకే 40 ఏళ్లు దాటిన వారు లేదా కుటుంబంలో క్యాన్సర్ ఉన్నవారు వైద్యుల సలహాతో ఈ క్రింది 6 స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
1. మమోగ్రామ్ (Mammogram)..
మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఇది అత్యంత ప్రామాణికమైన పరీక్ష. చేతికి గడ్డలు తగలకముందే, అతి చిన్న కణితిలను కూడా ఈ ఎక్స్-రే ద్వారా గుర్తించవచ్చు.
ఎప్పుడు చేయించుకోవాలి అంటే..?: 40 ఏళ్లు దాటిన మహిళలు ఏటా ఒకసారి చేయించుకోవడం మంచిది.
2. ప్యాప్ స్మియర్ (Pap Smear)..
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) నివారణకు ఈ పరీక్ష ఒక వరం. గర్భాశయ కణాలలో వచ్చే మార్పులను ఇది ముందుగానే పసిగడుతుంది.
ఎప్పుడు చేయించుకోవాలి అంటే..? : వివాహిత మహిళలు 25 ఏళ్ల వయస్సు నుంచి ప్రతి మూడేళ్ల కు ఒకసారి వైద్యుల సలహా మేరకు చేయించుకోవాలి.
3. కొలొనోస్కోపీ (Colonoscopy)..
పెద్దపేగు క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఈ పరీక్ష చేస్తారు. పేగుల్లో ఉండే పాలిప్స్ అంటే చిన్న గడ్డలు క్యాన్సర్‌గా మారకముందే ఈ పరీక్ష ద్వారా వాటిని తొలగించే అవకాశం ఉంటుంది.
ఎప్పుడు చేయించుకోవాలి అంటే..? : 45 ఏళ్లు దాటిన వారు ప్రతి 5 నుంచి 10 ఏళ్లకు ఒకసారి చేయించుకోవాలి.
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
4. పీఎస్‌ఏ టెస్ట్ (PSA Test)..
పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించేందుకు 'ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్' (PSA) రక్త పరీక్ష చేస్తారు. రక్తంలో ఈ ప్రోటీన్ స్థాయిలు పెరిగితే అది క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు.
ఎప్పుడు చేయించుకోవాలి అంటే..? : 50 ఏళ్లు దాటిన పురుషులు ఏడాదికి ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.
5. లో-డోస్ సీటీ స్కాన్ (LDCT)..
దీర్ఘకాలంగా ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) ముప్పు ఎక్కువగా ఉంటుంది. సాధారణ ఎక్స్-రేలో కనిపించని మార్పులను ఈ లో-డోస్ సీటీ స్కాన్ ద్వారా పక్కాగా గుర్తించవచ్చు.
ఎప్పుడు చేయించుకోవాలి అంటే..? : 50 ఏళ్లు దాటిన ధూమపాన ప్రియులు వైద్యులను సంప్రదించి ఈ పరీక్ష చేయించుకోవాలి.
6. ఓరల్ స్క్రీనింగ్ (Oral Exam)..
భారతదేశంలో నోటి క్యాన్సర్ కేసులు చాలా ఎక్కువ. దంత వైద్యులు చేసే సాధారణ నోటి పరీక్ష ద్వారా చిగుళ్లు, నాలుక లేదా గొంతులో వచ్చే అసాధారణ మార్పులను ప్రాథమిక దశలోనే కనిపెట్టవచ్చు.
ఎప్పుడు చేయించుకోవాలి అంటే..? : పొగాకు, మద్యం అలవాటు ఉన్నవారు కనీసం ఆరు నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవాలి. ఏవైనా వైద్యపరీక్షలు చేయించుకునే ముందు నిపుణులైన వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే నిర్ణయం తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
