30 ఏళ్ల తర్వాత పురుషుల్లో వచ్చే 6 ప్రధాన వ్యాధులు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : 30 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత పురుషుల్లో ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ వయస్సులో శరీరంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు, తినే ఆహారం కారణంగా కొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మూడుపదుల వయసు తర్వాత  పురుషుల్లో ఆరు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వారు అంటున్నారు. అయితే అలాంటి వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు.  

హై బ్లడ్ ప్రెషర్ (Hypertension): 30 ఏళ్ల తర్వాత అధిక రక్తపోటు సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్, ,గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. తినే ఆహారం, ఒత్తిడి, జీవనశైలి కారణంగా హై బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది.

ఇది కూడా చదవండి.. మెనోపాజ్ నిర్వహణలో జీవనశైలి,ఆహారం ఎలాంటి పాత్ర పోషిస్తాయి..? 

ఇది కూడా చదవండి.. సమతుల్య ఆహారంలో గింజలు, విత్తనాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి? 

ఇది కూడా చదవండి.. ప్రధాన నగరాల్లో కాలుష్య స్థాయిలు.. ఎలా ఉన్నాయి..? 

ఇది కూడా చదవండి.. లక్షలాది మంది ప్రాణాలను తీస్తున్న పారిశుధ్య లోపం.. 

మధుమేహం (Diabetes): అధిక బరువు, సరైన ఆహారం లేకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా టైప్ 2 మధుమేహం సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. 30 ఏళ్ల తర్వాత బ్లడ్ షుగర్ స్థాయిలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. 

కొలెస్ట్రాల్ (High Cholesterol): కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, రసాయనాలతో పండించిన కూరగాయలు తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వంటివి ప్రధాన కారణాలు.

అధిక బరువు పెరుగుదల (Obesity & Weight Gain): 30 ఏళ్ల తర్వాత మెటాబాలిజం మందగించటం వల్ల అధిక బరువు పెరగడం సాధారణం. అధిక బరువు ఫ్యాటీ లివర్, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.

నిద్ర రుగ్మతలు (Sleep Disorders): ఒత్తిడి, జీవనశైలి మార్పులు, స్మార్ట్‌ఫోన్ వాడకం వంటి కారణాలతో 30 ఏళ్ల తర్వాత నిద్ర రుగ్మతలు రావడం సాధారణం. ఇది శరీర శక్తిని తగ్గించి, మానసిక సమస్యలకు కారణమవుతుంది.

 మానసిక ఆరోగ్యం (Mental Health Issues): 30 ఏళ్ల తర్వాత వ్యాపారం, కుటుంబ బాధ్యతలు, ఒత్తిడి కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.  

 
30 ఏళ్ల తర్వాత ఈ ఆరోగ్య సమస్యలను నివారించడానికి సరైన ఆహారం, వ్యాయామం, మంచి నిద్ర, ఒత్తిడి నిర్వహణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ వ్యాధులను గమనించి, ముందస్తుగా పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చు.  

 

ఇది కూడా చదవండి.. B12 విటమిన్ లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..?

ఇది కూడా చదవండి..రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సూపర్‌ఫుడ్స్..?

ఇది కూడా చదవండి..ఆడవాళ్ళలో కంటి సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలు..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.