శరీరంలో ఈ 7 లక్షణాలు కనిపిస్తే.. కొల్లాజెన్ తగ్గినట్లే..  

సాక్షి లైఫ్ : శరీరానికి అవసరమైన పోషకాల్లో ఏది లోపించినా అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాంటి ముఖ్యమైన పోషకాల్లో కొల్లాజెన్ ఒకటి. ఇది ఒక రకమైన ప్రోటీన్, ఇది మన చర్మం, ఎముకలు, కీళ్ళు, కండరాలు, జుట్టు ఆరోగ్యానికి అత్యవసరం. మన శరీరంలోని మొత్తం ప్రోటీన్‌లో దాదాపు 30శాతం కొల్లాజెన్ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం సహజం.

ఇది కూడా చదవండి..కాలేయం, కిడ్నీ సమస్యలున్నప్పుడు కనిపించే 5 కీలక సంకేతాలు ఇవే..

ఇది కూడా చదవండి..హైపోథైరాయిడిజాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏమేం చేయాలి..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

అయితే, ప్రస్తుత జీవనశైలి, ధూమపానం, నిద్రలేమి, ఒత్తిడి వంటి అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే కొల్లాజెన్ లోపం తలెత్తుతోంది. ఈ లోపం ఉన్నప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఆయా లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా తగిన చర్యలు తీసుకోవచ్చు. కొల్లాజెన్ లోపం ఉన్నప్పుడు కనిపించే ఏడు ప్రధాన లక్షణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

కొల్లాజెన్ లోపం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు.. 

 చర్మం ముడతలు: కొల్లాజెన్ లోపిస్తే చర్మం బిగుతు కోల్పోయి వదులవుతుంది. ముడతలు, సన్నటి గీతలు ఏర్పడతాయి. చర్మం పొడిబారి, నిర్జీవంగా కనిపిస్తుంది.

జుట్టు రాలడం, పలచబడటం: జుట్టు విపరీతంగా రాలుతున్నా, పలచబడి, బలహీనంగా, నిర్జీవంగా మారినా కొల్లాజెన్ లోపం కారణం కావచ్చు. కొన్నిసార్లు నెత్తిమీద చర్మం కనిపించడం కూడా ప్రారంభమవుతుంది.

కళ్ల కింద నల్లటి వలయాలు, అలసట: కొల్లాజెన్ లోపిస్తే కళ్ళు లేదా బుగ్గల చుట్టూ గుంటలు, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. దీనివల్ల వయసు ఎక్కువగా ఉన్నట్లు, లేదా తీవ్ర అలసటగా ఉన్నట్లు కనిపిస్తుంది.

కండరాల బలహీనత, నొప్పి: కండరాల కణజాలానికి కొల్లాజెన్ చాలా ముఖ్యం. ఇది లోపిస్తే కండరాలు బలహీనపడతాయి. శరీరంలో నొప్పులు కూడా తలెత్తవచ్చు.

కీళ్ల నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్: కొల్లాజెన్ తక్కువగా ఉంటే కీళ్లలో దృఢత్వం, నొప్పి పెరుగుతుంది. మృదులాస్థి (cartilage) త్వరగా అరిగిపోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది.

బలహీనమైన గోళ్లు: గోళ్లు సులభంగా విరిగిపోతున్నా, పెళుసుబారిపోతున్నా కొల్లాజెన్ లోపం కారణం కావచ్చు. గాయాలు మానడానికి ఎక్కువ సమయం: గాయాలను నయం చేయడంలో కొల్లాజెన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది లోపిస్తే చిన్న గాయాలు కూడా మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఈ లక్షణాలను గుర్తించడం ద్వారా కొల్లాజెన్ లోపం ఉందని చెప్పవచ్చు.  

 

ఇది కూడా చదవండి..హైపోథైరాయిడిజం ఉన్నవారు దూరంగా ఉండాల్సినవి/మితంగా తీసుకోవాల్సినవి.. 

ఇది కూడా చదవండి..సైనసైటిస్‌తో బాధపడుతున్నారా? అలర్జీలు రాకుండా ఇలా చేయండి..! 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : symptoms deficiency collagen-benefits collagen benefits-of-collagen health-benefits-of-collagen collagen-for-skin collagen-peptides what-is-collagen collagen-supplements collagen-supplement collagen-powder skin-collagen collagen-protein collagen-for-skin-tightening
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com