దగ్గరి బంధువుల మధ్య పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి..?
సాక్షి లైఫ్ : ఆధునిక సమాజంలో బంధుత్వ వివాహాలపై చర్చ తీవ్రమవుతోంది. సాంప్రదాయాలు, సామాజిక కారణాల వల్ల దగ్గరి బంధువుల మధ్య వివాహాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అయితే, ఇలాంటి వివాహాల వల్ల పుట్టబోయే పిల్లలకు కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై అవగాహన లేకపోవడం వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
దగ్గరి బంధువుల మధ్య జరిగే వివాహాల వల్ల జన్యుపరమైన లోపాలు సంక్రమించే ప్రమాదం పెరుగుతుంది. తల్లిదండ్రులిద్దరికీ ఒకే రకమైన జన్యు లోపం ఉన్నట్లయితే, పుట్టబోయే పిల్లలకు ఆ లోపం సంక్రమించే అవకాశం గణనీయంగా పెరుగుతుంది.
ఇది కొన్ని తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులకు దారితీయవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు? రాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను గురించి ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫెటల్ మెడిసిన్ రిప్రొడక్టివ్ జెనిటిక్స్ డైరెక్టర్ డా. బూరగడ్డ శ్రీనాథ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
