Fennel Seeds After Meals : భోజనం తర్వాత ఒక చెంచా సోంపుతో ఆ మూడు సమస్యలకు చెక్..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: హోటళ్లలో భోజనం ముగిశాక సోంపును మౌత్ ఫ్రెషనర్‌గా ఇవ్వడం మనం చూస్తుంటాం. అయితే ఇది కేవలం నోటి తాజాగా ఉంచడానికే అనుకుంటే పొరపాటే. భోజనం తర్వాత ఒక చెంచా సోంపు తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. సోంపుతో కలిగే ఆ మూడు ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

1. గ్యాస్ నుంచి విముక్తి.. 

భారీ భోజనం చేసినప్పుడు కడుపు ఉబ్బరంగా, భారంగా అనిపించడం సహజం. సోంపు గింజల్లో ఉండే 'అనెథోల్' అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు, అధిక పీచు పదార్థం (fiber) జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి కడుపులో గ్యాస్ ఏర్పడకుండా నిరోధించడమే కాకుండా, మలబద్ధక సమస్యను కూడా తగ్గిస్తాయి.

2. కడుపు నొప్పి, అసౌకర్యానికి చెక్.. 

అతిగా తినడం వల్ల కొన్నిసార్లు పేగులపై ఒత్తిడి పెరిగి కడుపులో అసౌకర్యం లేదా నొప్పి కలుగుతుంది. సోంపు గింజలకు కండరాలను సడలించే గుణం ఉంది. భోజనం తర్వాత సోంపు నమలడం వల్ల కడుపు కండరాలు రిలాక్స్ అవుతాయి. దీనివల్ల కడుపు నొప్పి తగ్గి, తిన్న ఆహారం త్వరగా జీర్ణమై శరీరం తేలికగా మారుతుంది.

3. నోటి దుర్వాసన దూరం..

నోటిని తాజాగా ఉంచడంలో సోంపును మించినది లేదు. ఇందులో ఉండే సహజ సుగంధ తైలాలు యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి నోటిలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతాయి. సోంపును నమలడం వల్ల లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు నోటిని శుభ్రంగా ఉంచుతుంది. జీర్ణక్రియ మెరుగుపడాలన్నా, కడుపు హాయిగా ఉండాలన్నా రోజువారీ ఆహారంలో భాగంగా భోజనం తర్వాత ఒక చెంచా సోంపును అలవాటు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.