ప్రమాద ఘంటికలు..! ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో లివర్‌కు ముప్పు తప్పదా?

సాక్షి లైఫ్ : లివర్ (liver) అనేది మన శరీరంలో రెండో అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన అవయవం. శరీరం నుంచి విషాలను (Toxins) తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే, ఈ మధ్యకాలంలో ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య 'ఫ్యాటీ లివర్' (Fatty Liver). ఈ సమస్య రావడానికి ముఖ్య కారణాలలో ప్రాసెస్డ్ ఫుడ్స్ (Processed Foods) ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వైద్యనిపుణులు, పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

ఇది కూడా చదవండి..సడెన్ గా డైట్ చేంజ్ చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి..? 

 

ప్రాసెస్డ్ ఫుడ్స్ లివర్‌ను ఎలా దెబ్బతీస్తాయి..?

ప్రాసెస్ చేసిన ఆహారాలలో (కుకీలు, చిప్స్, ప్యాక్ చేసిన అల్పాహారాలు, సాఫ్ట్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్) ఉండే కొన్ని అంశాలు నేరుగా లివర్‌పై భారం వేస్తాయి. 

అధిక చక్కెర, ఫ్రక్టోజ్ (Fructose)..  

ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఎక్కువగా హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ (High Fructose Corn Syrup - HFCS) ఉంటుంది. గ్లూకోజ్ (Glucose) మాదిరిగా కాకుండా, ఫ్రక్టోజ్ దాదాపు పూర్తిగా లివర్‌లోనే ప్రాసెస్ అవుతుంది. లివర్ ఈ ఫ్రక్టోజ్‌ను శక్తిగా మార్చే ప్రక్రియలో, ఎక్కువ భాగాన్ని త్వరగా కొవ్వుగా (Fat) మారుస్తుంది.
ఈ కొవ్వు కాలేయంలో పేరుకుపోవడం వల్లే నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వస్తుంది.

అనారోగ్యకరమైన కొవ్వులు (Trans Fats & Saturated Fats)..  

ఈ ఆహారాల్లో ఉండే అధిక సంతృప్త కొవ్వులు (Saturated Fats), ట్రాన్స్ ఫ్యాట్స్ (Trans Fats) లివర్‌ చుట్టూ కొవ్వు నిల్వలు పెరిగేలా చేస్తాయి.
దీనివల్ల కాలేయం పనితీరు నెమ్మదిస్తుంది, వాపు (Inflammation) పెరుగుతుంది.

సోడియం (ఉప్పు) అధికం..  

ప్రాసెస్డ్ ఆహారాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అధిక సోడియం తీసుకోవడం వల్ల శరీరంలో ద్రవాలు పేరుకుపోయి, లివర్‌పై ఒత్తిడి పెరుగుతుంది.

టాక్సిన్స్ (Toxins) భారం.. 

లివర్‌ ముఖ్య విధి శరీరంలోని వ్యర్థాలను, విషాలను బయటకు పంపడం. ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల లివర్‌కు అదనపు పనిభారం ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా లివర్ కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

ప్రమాదం..?

మొదట్లో ఫ్యాటీ లివర్ లక్షణాలు కనిపించకపోయినా, ఈ సమస్య ముదిరితే...లివర్ సిరోసిస్ (Liver Cirrhosis): కాలేయం గట్టిపడి, శాశ్వతంగా దెబ్బతింటుంది. లివర్ క్యాన్సర్ (Liver Cancer): కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance): దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ (Type 2 Diabetes) వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి మరి..?

ప్రాసెస్డ్ ఫుడ్స్ పూర్తిగా మానేయండి: ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ స్నాక్స్, అధిక చక్కెర పానీయాలకు పూర్తిగా దూరంగా ఉండండి.సమతుల్య ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు (Whole Grains), నట్స్ ,ఆరోగ్యకరమైన నూనెలు (ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు వంటివి) ఎక్కువగా తీసుకోండి.వ్యాయామం: ప్రతిరోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల కొవ్వు కరిగి, లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఆల్కహాల్ కుదూరంగా ఉండాలి: మద్యపానానికి దూరంగా ఉండటం లివర్ ఆరోగ్యానికి చాలా కీలకం. ఒకవేళ మీకు ఫ్యాటీ లివర్ లక్షణాలు అలసట, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటివి కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యనిపుణులను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

 

ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : liver-damage liver-health ultra-processed-food liver-infection fatty-liver fatty-liver-symptoms processed-food liver-injury how-to-cure-fatty-liver liver-disease-signs
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com