కాఫ్ సిరప్ మరణాలు.. మొదటిసారి కాదా..? 

షేర్ చేయండి:
కాఫ్ సిరప్ మరణాలు.. మొదటిసారి కాదా..? 

సాక్షి లైఫ్ : విషపూరిత కాఫ్ సిరప్ కారణంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 20మందికి పైగా పిల్లలు మరణించిన ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుండగా, పలు చోట్ల విచారణ జరుగుతుండగా, మరికొన్ని చోట్ల చర్యలు తీసుకుంటున్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారా? కాదు. 

 

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

 

1986లో ముంబైలో విషపూరిత కఫ్ సిరప్‌తో 14 మంది, ఢిల్లీలో 33 మంది చిన్నారులు మరణించారు. ఆ తర్వాత 2020లో జమ్మూలో 12 మంది పిల్లలు చనిపోయారు. ప్రతిసారీ అంతా సరిచేస్తామని హామీలు ఇచ్చినా, పరిస్థితులు మాత్రం ఏమీ మారలేదు. 2022లో భారతీయ ఔషధ సంస్థలు తయారుచేసిన కాఫ్ సిరప్‌ల కారణంగా గాంబియా, ఆ తర్వాత ఉజ్బెకిస్థాన్‌లలో అనేక మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.

ఈ మరణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా పరిగణనలోకి తీసుకుంది. ఈ సంఘటనల వల్ల భారతీయ ఔషధ సంస్థలకు అపకీర్తి వచ్చింది. ఈ చెడ్డపేరు కారణంగా, విషపూరిత సిరప్‌లు తయారుచేసిన సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని, ఔషధాల నాణ్యతను పరీక్షించే ప్రభుత్వ ఏజెన్సీలు తమ పనిని సరిగా చేస్తాయని భావించారు. కానీ, ఫలితం 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్న చందంగా ఉంది.

గాంబియా, ఉజ్బెకిస్థాన్‌లకు కాఫ్ సిరప్‌లు సరఫరా చేసిన సంస్థలపై తక్షణ చర్యలు తీసుకున్నా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆదర్శంగా నిలిచేలా గట్టి చర్యలు తీసుకోలేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కోల్డ్‌రిఫ్ కాఫ్ సిరప్‌ను సరఫరా చేసిన కంపెనీ విషయంలోనూ ఇలాగే జరిగితే ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే ఈ సిరప్‌లో విషపూరిత రసాయనాల వాడకంపై విపరీతంగా వార్తలు వస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.