సాక్షి లైఫ్ : మనం నూనెను పదే పదే వేడి చేసినప్పుడు, దానిలో కొన్ని విషపూరిత పదార్థాలు (Toxic Compounds) ఫ్రీ రాడికల్స్ విడుదల కావడం మొదలవుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ నేరుగా మన శరీరంలోని కణాలను (Cells) దెబ్బతీస్తాయి, దీనివల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. పదే పదే వేడి చేయడం వల్ల నూనెలో ఆల్డిహైడ్స్ (Aldehydes),పీహెచ్ (pH) వంటి రసాయనాలు కూడా ఏర్పడతాయి. ఇవి కార్సినోజెనిక్ (Carcinogenic) స్వభావం కలిగివుంటాయి. అంటే, ఇవి శరీరంలో క్యాన్సర్‌ను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
స్ట్రీట్ ఫుడ్ విషయంలో మరింత జాగ్రత్త..!
ఓ సర్వేలో భారతదేశంలోని చాలా మంది స్ట్రీట్ ఫుడ్ అమ్మకందారులు ఒకే నూనెను 4 నుంచి 5 సార్లు ఉపయోగిస్తున్నారని తేలింది. వారి వద్ద నుంచి తీసుకున్న నూనె నమూనాలలో విషపూరిత పదార్థాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే కూడా రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.
మనం ఏం చేస్తే బెటర్..?
ఎప్పుడూ తాజా నూనెను ఉపయోగించడంతోపాటు, ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ వాడటం మానుకోవడం మరింత ఉత్తమం. ఆరోగ్యకరమైన నూనెలను ఎంచుకోవాలి.. ఆవ నూనె (Mustard Oil), వేరుశెనగ నూనె (Groundnut Oil) వంటి ఆరోగ్యకరమైన ఎంపికలను ఎంచుకోండి. ఇవి ఆరోగ్యానికి మంచివిగా పరిగణిస్తారు.
ఆలివ్ ఆయిల్‌ను సరిగ్గా వాడాలి.. వంట కోసం పోమెస్ (Pomace) ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించవద్దు. దానికి బదులుగా, ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌ను సలాడ్‌లు లేదా తేలికపాటి డ్రెస్సింగ్‌ల కోసం మాత్రమే ఉపయోగించాలి, వేయించడానికి కాదు.
వేయించిన వాటికి బదులు బేక్/ఆవిరి పద్ధతిని ఎంచుకోవాలి.. మీ ఆహారంలో వేయించిన ఆహారాన్ని తగ్గించి, బేక్ చేసిన (Bake) లేదా ఆవిరిపై ఉడికించిన (Steam) ఆహారాన్ని చేర్చుకోండి. దేశీ నెయ్యిని ఉపయోగించడం మంచిది: సాధ్యమైతే వంట కోసం దేశీ నెయ్యిని (Desi Ghee) ఉపయోగించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇది అత్యంత సురక్షితమైన, ఆరోగ్యకరమైనదని వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com