ప్రశాంతమైన నిద్రకు తోడ్పడే అద్భుతమైన ఆహారాలు..
సాక్షి లైఫ్ : ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేసి అలసిపోయిన తర్వాత రాత్రి సమయంలో హాయిగా నిద్రించడం ద్వారా మానసికంగా, శారీరకంగా అలసట తీరి చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. నేడు అనేక రంగాల్లో పనిచేసే వారందరూ సరైన నిద్రలేక ఎంతో బాధపడుతున్నారు. మంచి అందుకోసం రకరకాల థెరపీలను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు పలురకాల ఔషధాలు వినియోగిస్తున్నారు. అయితే ఎటువంటి మందులూ, మాకులు లేకుండా సంతృప్తికరమైన నిద్ర కోసం ఏమేం చేయాలో..? ఏమేం చేయకూడదో..? ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
తేలికపాటి ఆహారం: రాత్రి భోజనం ఎప్పుడూ తేలికగా, త్వరగా జీర్ణమయ్యేదిగా ఉండాలి.
పప్పులు, చపాతీ: పప్పు, చపాతీ మంచి ఎంపిక. ఇవి తేలికగా జీర్ణమవుతాయి, పోషకాలను అందిస్తాయి.
బ్రకోలీ, కొబ్బరి, పుదీనా: బ్రోకలీ, కొబ్బరి, పుదీనా కలిపిన వంటకాలు జీర్ణక్రియకు సహాయపడతాయి.
ఓట్స్ తో చేసినవి: ఓట్స్ తో చేసిన ఆహారాలు కూడా రాత్రిపూట తీసుకోవచ్చు.
ఆకుకూరలు (పాలకూర, కాలే): పాలకూరలో లాక్టోస్ పుష్కలంగా ఉంటుంది, ఇది నిద్రకు సహాయపడుతుంది. కాలేలో కాల్షియం ఉంటుంది, ఇది నిద్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
పిస్తా: మెగ్నీషియం, ప్రోటీన్, విటమిన్ B6 సమృద్ధిగా ఉండే పిస్తా మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.
కివీ పండు: విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్,సెరోటోనిన్ అధికంగా ఉండే కివీ పండు ప్రశాంతమైన నిద్రకు సహాయపడుతుంది.
వేడి పాలు: పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడి నిద్రను మెరుగుపరుస్తుంది.
తేనె: తేనె తీసుకొవడం వల్ల నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.
రాత్రిపూట తీసుకోకుండా ఉండాల్సినవి..
అధిక కొవ్వు పదార్ధాలు: వేయించినవి, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడతాయి.
కారంగా ఉండే ఆహారం: కారం ఎక్కువగా ఉండేవి గుండెల్లో మంట, అజీర్తిని కలిగిస్తాయి.
తీపి పదార్ధాలు: చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి నిద్రకు భంగం కలిగిస్తాయి.
కెఫిన్, ఆల్కహాల్: నిద్రకు ముందు కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. ప్రతి వ్యక్తి శరీరం, అభిరుచులు వేర్వేరుగా ఉంటాయి. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే, నిపుణులైన డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే
ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళ
ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
