Online Medical Tests : ఆన్ లైన్ మెడికల్ టెస్టులు కరెక్టేనా..? గందరగోళంలో రోగులు.. ఆందోళనలో వైద్యులు.. 

సాక్షి లైఫ్ : ఇంటర్నెట్ పుణ్యమా అని అరచేతిలోనే అన్నీ లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే రోగులు తమంతట తామే ఆన్‌లైన్‌లో ల్యాబ్ పరీక్షలు చేయించుకోవడం ఇప్పుడు వైద్య రంగంలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. వైద్యుల సిఫార్సు లేకుండానే నేరుగా కంపెనీల ద్వారా పరీక్షలు చేయించుకుని, ఆ రిపోర్టులతో క్లినిక్‌లకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

 ఆందోళనలో వైద్యులు.. గందరగోళంలో రోగులు..

సాధారణంగా చేసే రక్త పరీక్షల్లో అన్నీ మామూలుగానే ఉన్నా, లోలోపల ఏదో అనారోగ్యం ఉందన్న ఆందోళన చాలామందిలో ఉంటోంది. క్లీవ్‌లాండ్‌కు చెందిన 48 ఏళ్ల డారెన్ సిడవే అనే వ్యక్తి కథే దీనికి ఉదాహరణ. తన బరువు, జీవక్రియల గురించి ఆందోళన చెందిన అతను, వైద్యుడికి చెప్పకుండానే సుమారు 200 డాలర్లు ఖర్చు చేసి 'గుడ్‌ల్యాబ్స్' వంటి సంస్థల ద్వారా డజన్ల కొద్దీ పరీక్షలు చేయించుకున్నారు.

ఇందులో ఇన్సులిన్ నిరోధకత, రోగనిరోధక వ్యవస్థలో వాపు (Inflammation) వంటి అంశాలకు సంబంధించిన 'బయోమార్కర్ల'ను ఆయన స్వయంగా పరిశీలించుకున్నారు. అయితే, ఈ రిపోర్టులను చూసి వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. అనవసరమైన పరీక్షల వల్ల రోగులు ఆందోళనకు గురికావడమే కాకుండా, చికిత్సలో గందరగోళం ఏర్పడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ప్రధాన సమస్యలు.. 

 క్లినిక్‌కు వచ్చిన రోగికి ఉన్న తక్కువ సమయంలో, అనవసరమైన రిపోర్టులను వివరించడానికే ఎక్కువ సమయం పడుతోందని దీని కారణంగా సమయం వృథా కావడమేకాకుండా వ్యాధి ముదురుతుందని వైద్యనిపుణులు వాపోతున్నారు.

గూగుల్‌లో సమాచారం చూసి..

అశాస్త్రీయ ధోరణి..రోగికి అవసరం లేని పరీక్షలు చేయించుకోవడం వల్ల మానసిక ఆందోళన పెరుగుతుందే తప్ప, క్లినికల్‌గా అవి పెద్దగా ఉపయోగపడవని నిపుణులు చెబుతున్నారు. గూగుల్‌లో సమాచారం చూసి, తమ రిపోర్టులను తామే విశ్లేషించుకోవడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్య శాస్త్రంలో ఒక మార్పు రావాలంటే దశాబ్దాల పరిశోధనలు కావాలి.

కానీ రోగులు అంత కాలం వేచి ఉండలేకపోతున్నారు. ఈ కొత్త ధోరణిని ఎలా ఎదుర్కోవాలో వైద్యులు కూడా అలవాటు చేసుకోవాల్సి వస్తోంది అని డారెన్ వంటి వారు అభిప్రాయపడుతున్నారు. సాంకేతికత అందుబాటులోకి రావడం మంచిదే అయినా, నిపుణుల సలహా లేకుండా చేసే ఇటువంటి ప్రయోగాలు వైద్యులకు, రోగులకు మధ్య కొత్త సవాళ్లను విసురుతున్నాయి.  

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : medical-tests national-medical-commission medical-experts medical-professionals medical-regulations medical-technology medical-innovation medical-intervention medical-update medical-screening medical-information online-medical-tests offline-medical-tests
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com