Exercise : వ్యాయామం భారంగా అనిపిస్తోందా..? ఐతే ఈ 'ట్రిక్' మీ కోసమే..!

షేర్ చేయండి:
Exercise : వ్యాయామం భారంగా అనిపిస్తోందా..? ఐతే ఈ 'ట్రిక్' మీ కోసమే..!

సాక్షి లైఫ్ : చాలామంది వ్యాయామం స్టార్ట్ చేయగానే త్వరగా అలసిపోతుంటారు. ఎందుకంటే..? కండరాల కంటే ముందు మెదడు "ఇక నావల్ల కాదు" అని సంకేతాలు పంపడమే దీనికి ప్రధాన కారణమని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే, వ్యాయామం చేసే సమయంలో పెద్దగా శ్రమ అనిపించకుండా చేసే ఒక అద్భుతమైన మార్గాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనివల్ల శరీరం ఎంత కష్టపడుతున్నా, మెదడు మాత్రం అది చాలా సులభమని భావిస్తుంది.

 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..?

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 

శాస్త్రవేత్తల ప్రయోగం ఏంటి..?

ఇటీవల సైక్లింగ్‌ చేసే వ్యక్తులపై శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన ప్రయోగం చేశారు. వ్యాయామం ప్రారంభించడానికి ముందు వారి కండరాలను కలిపే నరాల మీద (Tendons) చిన్నపాటి వైబ్రేషన్లు కలిగించారు. దీనివల్ల ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. వైబ్రేషన్ల వల్ల సైక్లింగ్ చేస్తున్నప్పుడు వారు సాధారణం కంటే ఎక్కువ కష్టపడినా, వారికి మాత్రం పెద్దగా అలసట అనిపించలేదు. వారి గుండె, కండరాలు మునుపటి కంటే వేగంగా పనిచేస్తున్నప్పటికీ, మెదడు మాత్రం ఆ ఒత్తిడిని తక్కువగా గుర్తించింది.

మెదడును ఎలా మోసం చేయవచ్చు..?

మన శరీరం చేసే శ్రమను మెదడు ఎలా అర్థం చేసుకుంటుందనే దానిపై ఈ పరిశోధన సాగింది. శరీరం పంపే అలసట సంకేతాలను మెదడు సరిగ్గా గ్రహించకుండా ఈ 'వైబ్రేషన్ ట్రిక్' అడ్డుకుంటుంది. అంటే, వాస్తవానికి మీ శరీరం కఠినమైన వ్యాయామం చేస్తున్నా, మీ మనసు మాత్రం "ఇది చాలా తేలిక" అని భావిస్తుంది. దీనినే శాస్త్రవేత్తలు 'బ్రెయిన్-బాడీ మిస్-మ్యాచ్' అని పిలుస్తున్నారు.

ఎవరికి ఉపయోగం..?

శారీరక శ్రమ చేయాలంటే భయపడే వారికి లేదా వ్యాయామం అంటే బద్ధకించే వారికి ఈ పరిశోధన ఒక వరమని చెప్పవచ్చు. భవిష్యత్తులో ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే.. స్థూలకాయంతో బాధపడేవారు ఎక్కువ సేపు అలసిపోకుండా వర్కవుట్లు చేయవచ్చు. అంతేకాదు క్రీడాకారులు తమ సామర్థ్యాన్ని (Endurance) పెంచుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారు ఫిజియోథెరపీ వంటివి సులభంగా చేయగలుగుతారు.

ప్రస్తుతానికి ఇది పరిశోధన దశలోనే ఉన్నప్పటికీ, వ్యాయామం అనేది కేవలం కండరాలకు సంబంధించింది మాత్రమే కాదు, అది మెదడుతో ముడిపడి ఉన్న ప్రక్రియ అని ఈ అధ్యయనం నిరూపిస్తోంది. వ్యాయామం చేసేటప్పుడు ఇష్టమైన పాటలు వినడం లేదా స్నేహితులతో మాట్లాడటం వల్ల కూడా మెదడు అలసటను తక్కువగా గుర్తిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. తినే సమయంలో నీళ్లు తాగకూడదా..? ఏమౌతుంది..?     

  ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..? 

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.