వ్యాయామం తర్వాత ఈ పానీయాలు తీసుకుంటున్నారా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వ్యాయామం చేసిన తర్వాత, చాలా దాహం వేస్తుంది.  అటువంటి పరిస్థితిలో శరీర శక్తి కూడా తగ్గిపోతుంది. చాలా మంది దాహం తీర్చుకోవడానికి ప్యాకేజ్డ్ డ్రింక్స్ తాగుతుంటారు.  వ్యాయామం తర్వాత పొరపాటున కూడా కొన్నిరకాల డ్రింక్స్ తీసుకోకూడదని చెబుతున్నారు వైద్య నిపుణులు. వ్యాయామం చేసిన తర్వాత ఎలాంటి పానియాలు తాగకూడదు..ఎలాంటి పానియాలు తాగవచ్చు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్ తక్కువగా ఉందా..? ఈ ఆరు ఆహారాలు తీసుకోండి.. 

ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..

ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?


వ్యాయామం చేసిన తర్వాత సహజంగానే శరీరంలోని శక్తి తగ్గి,  అలసిపోయినట్లు అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో అలసట నుంచి ఉపశమనం పొందడానికి కొంతమంది వివిధ రకాల పానీయాలు తాగుతారు. జిమ్ ట్రైనర్లు వర్కవుట్ చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు, పండ్లరసాలు వంటివి తాగాలని సూచిస్తున్నప్పటికీ, చాలా మంది ప్యాక్డ్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు.

వ్యాయామం తర్వాత.. 
 
ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్..

వ్యాయామం తర్వాత పండ్ల రసం తాగడం మంచిది. తాజా పండ్ల రసాన్ని తీసుకోవడం ద్వారా అప్పటి వరకూ కోల్పోయిన శక్తిని మళ్లీ పొందవచ్చు. కానీ వ్యాయామం చేసిన తర్వాత ప్యాక్ చేసిన పండ్ల రసాన్ని తీసుకోకూడదని తద్వారా బరువు పెరిగే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులో అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఉంటుంది. ప్యాక్డ్ జ్యూస్ తయారు చేసేటప్పుడు, పండ్లలో ఉండే విటమిన్లు తగ్గిపోతాయి.

టీ,  కాఫీ.. 

టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుంది. ఇది శక్తిని పెంచడంలో సహాయపడు తుంది. కానీ వ్యాయామం చేసిన వెంటనే తాగడం వల్ల బరువును ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక హాని కలుగుతుంది. జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.

చల్లని పానీయాలు.. 

వ్యాయామం తర్వాత దాహం తీర్చుకోవడానికి మీరు సోడా డ్రింక్స్ తీసుకుంటే, మీ బరువు తగ్గడానికి బదులుగా పెరుగుతుంది. సోడా డ్రింక్స్ తాగడం వల్ల శరీరం నీరసం అవుతుంది. ఇలాంటి వాటిలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం.

మద్యం.. 

మీరు వ్యాయామం తర్వాత మద్యం సేవిస్తే, అది మీ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అంతేకాదు ఆల్కహాల్  తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీని కారణంగా పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

ఇది కూడా చదవండి..హైబీపీని నియంత్రించే పొటాషియం రిచ్ ఫుడ్స్.. 

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

 

ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.