సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ అవసరం. ఇవి చాలా తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అటువంటి వాటిలో పొటాషియం కూడా ఒక ముఖ్యమైన పోషకం. శరీరంలో దీని లోపం కారణంగా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఆహారంలో కొన్నిరకాల ఫుడ్స్ చేర్చుకోవడం ద్వారా ఆయా లోపాన్ని భర్తీ చేయవచ్చు.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అనేక వ్యాధుల నుంచి కాపాడే ముఖ్యమైన పోషకాలలో పొటాషియం కూడా ఒకటి. హై బీపీ ఉన్నవారికి ఇది చాలా ముఖ్యమైనది. ఇది బీపీ లెవల్స్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
పొటాషియం కండరాలను దృఢంగా ఉంచడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో పొటాషియం లేకపోతే అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు డాక్టర్లు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ ఆహారంలో పొటాషియం అధికంగా ఉండే ఆహారపదార్థాలను చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..
ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..
ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?
పెరుగు..
పోషకాలు అధికంగా ఉండే పెరుగు జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. ఇందులో ప్రోబయోటిక్ లక్షణాలు ఉంటాయి, ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పెరుగులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. భోజనంలో పెరుగును చేర్చుకోవచ్చు లేదా దాని నుంచి రైతా, కడి మొదలైన వంటకాలను తయారు చేసుకొని తినవచ్చు.
చిలగడదుంప..
ఇందులో ఫైబర్, విటమిన్ "ఏ" తగినంత పరిమాణంలో ఉంటాయి. అంతే కాకుండా ఇందులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిని ఉపయోగించి అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు. దీనిని ఉడకబెట్టి, కాల్చి కూడా తినవచ్చు.
అరటిపండు..
అరటిపండు తినడానికి ఇష్టపడని వారు ఉండరు. రుచితో పాటు పోషక గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో తగినంత పరిమాణంలో పొటాషియం లభిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు ,యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇది గుండెకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా అరటిపండు తినడం వల్ల కండరాలు వృద్ధి చెందుతాయి.
బీన్స్..
వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో పొటాషియం లోపాన్ని తొలగిస్తాయి. ఇందుకోసం పప్పులు, కిడ్నీ బీన్స్‌ను తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి.
పాలకూర..
ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. అంటువంటి వాటిలో పాలకూర చాలా ముఖ్యమైంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీ ఆహారంలో పాలకూరను చేర్చుకోవాలి. తద్వారా అనేక తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు.
నారింజ..
నారింజలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ "సి" తోపాటు పొటాషియం తగినంత పరిమాణంలో ఉంటాయి. మీరు దీన్ని మీ ఆహారంలో అనేక విధాలుగా చేర్చవచ్చు. నారింజను జ్యుస్ రూపంలో లేదా సలాడ్‌లో కూడా తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com