ఆస్తమా డే : ఆస్తమా లక్షణాలు ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : ఆస్తమా అనేది శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించి నివారించడం ద్వారా ఆస్తమాను నియంత్రణలో ఉంచవచ్చని ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. సాక్షి లైఫ్‌తో మాట్లాడుతూ, ఆస్తమా లక్షణాలు, ప్రధాన ట్రిగ్గర్‌లు, నివారణ చర్యల గురించి ఆయన వివరించారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఆస్తమా లక్షణాలు : ఆస్తమా రోగులు సాధారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెల్లో బిగుతు, దగ్గు, గురక వంటి లక్షణాలను ఎదుర్కొంటారు. ఈ లక్షణాలు రాత్రి లేదా ఉదయం సమయాల్లో తీవ్రమవుతాయి. కొందరిలో శారీరక శ్రమ, చల్లని వాతావరణం లేదా ఒత్తిడి వల్ల ఈ లక్షణాలు మరింత ఉధృతమవుతాయి. ఆస్తమా వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని డాక్టర్ విజయ్ సూచించారు. మరిన్ని విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
