స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ)పై అవగాహన అవసరం..
సాక్షి లైఫ్ : స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) వంటి అరుదైన వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఎస్ఎంఏ అనేది జన్యు సంబంధిత సమస్య, ఇది మోటార్ న్యూరాన్లపై ప్రభావం పడుతుంది. దీని ఫలితంగా క్రమంగా కండరాల బలహీనత తలెత్తుతుంది. ఇది తీవ్రమైతే ప్రాణాంతక మైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ వ్యాధిని సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు విభాగాల వైద్య నిపుణుల సమగ్ర వైద్యం అవసరమని నిపుణులు వెల్లడిస్తున్నారు.
హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోనంకి మాట్లాడుతూ, “ఎస్ఎంఏ ఉన్న శిశువులు సాధారణంగా పుట్టుకనుంచే బలహీనంగా ఉంటారు. వారి శరీర అవయవాలు మిగతా శిశువుల కంటే పేలవంగా ఉంటాయి. ఇది చాలా సందర్భాల్లో సాధారణ అభివృద్ధి ఆలస్యం లేదా ఇతర చిన్నచిన్న ఆరోగ్య సమస్యలుగా భావించే అవకాశం ఉంటుంది. వీటిని గుర్తించడానికి తల్లిదండ్రులకు సరైన అవగాహన అవసరం,” అని ఆయన వివరించారు.
ఇది కూడా చదవండి..కార్డియో వాస్క్యూలర్ డిసీజెస్ కు కారణాలు..? పరిష్కారాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది..?
ఇది కూడా చదవండి..మినరల్ వాటర్ పై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రకటన..
ఇది కూడా చదవండి..ఏవియన్ ఫ్లూ న్యూ వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?
ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
ఎస్ఎంఏ లక్షణాలు..?
శిశువుల్లో పాకడం, బోర్లాపడడం, కూర్చోవడం, నడవడం వంటి అభివృద్ధి దశల్లో ఆలస్యం.
కండరాల బలహీనతతో మింగడం, చప్పరించడం వంటి సమస్యలు.
శ్వాసకోశ సంబంధమైన ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం.
శక్తి లేకపోవడం, శారీరక అలసటను సాధారణ ఆరోగ్య సమస్యగా భావించే అవకాశం.
చికిత్స,నిర్వహణ..
ఎస్ఎంఏ నిర్వహణకు వివిధ వైద్య విభాగాల నిపుణుల సమన్వయం అవసరం. దీనిలో న్యూరాలజిస్ట్‌లు, పల్మనా లజిస్ట్‌లు, ఫిజియోథెరపిస్ట్‌లు, న్యూట్రిషనిస్ట్‌లు కలిసి పని చేస్తారు.
శ్వాసకోశ ఆరోగ్యానికి మద్దతు..
శ్వాసకోశ వ్యాయామాలు, అవసరమైనప్పుడు శ్వాస సంబంధిత పరికరాలు.
పోషకాహార మద్దతు: శారీరక బలాన్ని పెంచడానికి, శరీర స్థితిని మెరుగుపరచడానికి సరైన ఆహారం.
వ్యాయామాలు: కండరాల బలాన్ని మెరుగుపరచే ఫిజియోథెరపీలు అవసరం.
కుటుంబ సభ్యుల మద్దతు..
కుటుంబ సభ్యులు, రోగులకు కౌన్సెలింగ్ తోపాటు వారికి అవసరమైనసేవలు, సహాయక సమూహాల ద్వారా ప్రోత్సాహం.
నిపుణుల సూచన..
అరుదైన వ్యాధులపై అవగాహన, నిర్దిష్ట వ్యాధి లక్షణాలను గుర్తించడం, సమయానికి సరైన చికిత్స అందించడం ద్వారా రోగుల జీవిత నాణ్యతను పెంచడం సాధ్యమవుతుంది. ఎస్ఎంఏ ఉన్న రోగులకు అధునాతన వైద్య సేవలను అందించడానికి సమగ్ర ప్రణాళిక అవసరం. మల్టీడిసిప్లినరీ వైద్య విధానం ద్వారా ఎస్ఎంఏ బాధితులకు మెరుగైన జీవన నాణ్యతను అందించనున్నారు వైద్య నిపుణులు.
పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీకు తెలుసా?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
