Beat the Summer Heat : వేసవి తాపాన్ని తరిమికొట్టే చిట్కాలు.. ఆహార నియమాలే ఆరోగ్యానికి రక్ష..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు శరీరాన్ని, మనస్సును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆయుర్వేదం ప్రకారం ప్రస్తుతం మనం 'గ్రీష్మ ఋతువు'లో ఉన్నాం. ఈ సమయంలో ప్రకృతిలో వచ్చిన మార్పుల కారణంగా శరీరంలో కఫం క్షీణించి, వాతం పెరుగుతుంది. ఫలితంగా నీరసం, అలసటగా అనిపిస్తుంది. అయితే, మన ప్రాచీన ఆయుర్వేద జీవనశైలిని అనుసరించడం ద్వారా ఈ వేసవిని హాయిగా, ఆరోగ్యంగా గడపవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 

ఆహారమే మందు..

వేసవిలో మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ కాలంలో శరీరానికి చల్లదనాన్నిచ్చే  ద్రవ రూపంలో ఉండే తీపి పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

ఏం తినాలి మరి..? లచని మజ్జిగ, తగినంత నెయ్యి, పాలు, పండ్ల రసాలు తీసుకోవాలి.

ఏమేం తినవద్దు..?

కారం, పులుపు, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇవి శరీరంలో  పిత్తాన్ని పెంచుతాయి. అలాగే, పులియబెట్టిన పదార్థాలు, మద్యం శరీర సమతుల్యతను దెబ్బతీస్తాయి.

శరీరానికి చల్లదనం ఇలా..

వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కేవలం ఏసీలపైనే ఆధారపడకుండా కొన్ని సహజ పద్ధతులు పాటించడం మేలు.
తలకు నిత్యం కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. పిత్తాన్ని తగ్గించడంలో కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుంది. చందనం పేస్ట్‌ను నుదురుపై రాసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది.

 ఫ్రిజ్‌లోని అతి చల్లని నీటి కంటే మట్టి కుండలో నిల్వ చేసిన నీరు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఈ నీటిలో వట్టివేళ్లు లేదా ఎండిన ఉసిరికాయ ముక్కలు వేస్తే మరింత చల్లదనం లభిస్తుంది.

ప్రాణాయామంతో ప్రశాంతత.. 

ఎండ తీవ్రత వల్ల కలిగే చిరాకు, కోపం, భావోద్వేగ అసమతుల్యతను తగ్గించుకోవడానికి యోగా, ప్రాణాయామం తోడ్పడతాయి. శీతలీ ప్రాణాయామం శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా దాహాన్ని అదుపులో ఉంచుతుంది. నాడీశుద్ధి..మనసును ప్రశాంతంగా ఉంచడానికి ఇది ఉపకరిస్తుంది.

ఇతర జాగ్రత్తలు.. 

అధిక శ్రమతో కూడిన వ్యాయామాలకు బదులుగా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. రాత్రిపూట వెన్నెల తగిలేలా కొద్దిసేపు ఆరుబయట గడపడం మంచిది. ఇంటి పరిసరాల్లో మల్లె, కలువ వంటి తెల్లని పూల మొక్కలను పెంచడం వల్ల వాతావరణం ప్రశాంతంగా మారుతుంది.

 

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

 ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.