సాక్షి లైఫ్ : గుండె జబ్బులు లేదా మరేదైనా పెద్ద ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు, శస్త్రచికిత్స (Major Operation) చేయించుకోవడానికి సిద్ధమయ్యే ప్రతి రోగికి ఎన్నో సందేహాలు, ఆందోళనలు ఉంటాయి. ఆపరేషన్ అనగానే భయం సహజం. అయితే, రోగికి పూర్తిస్థాయి అవగాహన ఉంటే ఈ భయాన్ని తగ్గించుకోవచ్చని, నిర్ణయం తీసుకోవడం సులభతరం అవుతుందని అంటున్నారు ప్రముఖ హార్ట్ సర్జన్స్. ఏదైనా కీలక ఆపరేషన్ కు ముందు రోగులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 4 కీలక అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..For stress less life : మెంటల్ స్ట్రెస్ తగ్గించే ఆరోగ్యకరమైన నియమాలు
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
1. డాక్టర్ తో పేషంట్ బంధం చాలా ముఖ్యం (Doctor-Patient Relationship).. ఇది రెండు వైపులా ఉండాల్సిన బంధం (Two-way Street). ఆరోగ్య పరంగా ఇలాంటి బంధం చాలా కీలకంగా పనిచేస్తుంది. చికిత్స చేసే డాక్టర్ తో మీరు దృఢమైన బంధాన్ని ఏర్పరుచుకోవాలి. చికిత్సా ప్రణాళికలో ఏ చిన్న విషయంలోనైనా అర్థం కాకపోతే వెంటనే డాక్టర్‌ను అడగాలి. మీకు ఉండే ఆరోగ్యపరమైన సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఒకవేళ సందేహాలు అడగకుండా ఉండడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు.
2. చికిత్స పట్ల పూర్తి నిబద్ధత (Show Up and Commit)..డాక్టర్, మీరు కలిసి ఒక చికిత్సా ప్రణాళికను (Treatment Plan) నిర్ణయించుకున్న తర్వాత, దానికి పూర్తిగా కట్టుబడి ఉండాలి. ఆపరేషన్‌కు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పద్ధతులు, నియమాలు అన్నింటినీ కచ్చితంగా పాటించాలి. శస్త్రచికిత్స విజయవంతం కావడానికి, త్వరగా కోలుకోవడానికి రోగి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి.
3. మద్దతు వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి (Have a Support System)..కీలక సంప్రదింపులకు (Pre-op Visit) వెళ్ళినప్పుడు మీతో పాటు స్నేహితుడిని లేదా కుటుంబ సభ్యుడిని తీసుకెళ్లడం మంచిది. ఆపరేషన్‌కు సంబంధించిన చర్చలు చాలా ఉద్వేగభరితంగా ఉంటాయి. ఒకరు విన్నదానికంటే, ఇద్దరు వింటే ముఖ్యమైన సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉండొచ్చు. శస్త్రచికిత్స తర్వాత భావోద్వేగ మద్దతు (Emotional Support)ఆచరణాత్మక సహాయం (Practical Support) చాలా కీలకం.
4. రెండో అభిప్రాయం తీసుకోండి (Get That Second Opinion)..భయపడాల్సిన పనిలేదు మీకు సర్జరీకి సంబంధించి ఏదైనా సందేహం ఉంటే లేదా మరింత భరోసా కోసం రెండో వైద్య నిపుణుడి అభిప్రాయం (Second Opinion) తీసుకోవడానికి అస్సలు సంకోచించ వద్దు.ఆత్మవిశ్వాసం, సామర్థ్యం ఉన్న ఏ సర్జన్ కూడా మీరు రెండో అభిప్రాయం అడిగినందుకు ఏమీ అనుకోరు. ఎందుకంటే, ఇది అవిశ్వాసం కాదు, మీ ఆరోగ్యం కోసం ఉత్తమమైన నిర్ణయం తీసుకోవాలనే తపన మాత్రమే. ఈ నాలుగు సూత్రాలను పాటిస్తే, ఆపరేషన్ భయం తగ్గకపోయినా, మీరు తీసుకున్న నిర్ణయం ఉత్తమమైనదని మీకు పూర్తి భరోసా లభిస్తుంది.
ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com