మంచి నిద్ర కోసం ఉత్తమచిట్కాలు : మీరు ప్రతిరోజూ ఈ 5 సూపర్‌ఫుడ్స్ తింటే హాయి నిద్ర ఖాయం..
సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండటానికి ఆహారంతో పాటు, ఆరోగ్యకరమైన నిద్ర కూడా చాలా ముఖ్యం. ఒకవేళ నాణ్యమైన నిద్ర లేకపోతే అనేక అనారోగ్య సమస్యల బారీన పడాల్సి వస్తుంది. మానసికంగా, శారీరకంగాను అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందుకోసమే మెరుగైన నిద్ర చాలా అవసరం. కాబట్టి ఆరోగ్యకరమైన నిద్రకు ప్రయోజనకరంగా ఉండే కొన్ని సూపర్‌ఫుడ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఓట్స్..
సాధారణంగా అల్పాహారంగా తీసుకునే ఓట్స్ మంచి నిద్రలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇందులో పెద్ద పరిమాణంలో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో రాత్రంతా స్థిరమైన నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. వాటిలో మెలటోనిన్ కూడా ఉంటుంది, ఇది నిద్రకు ఉపకరిస్తుంది.
అరటిపండ్లు..
అరటిపండ్లు మెగ్నీషియం, పొటాషియం రెండింటినీ కలిగి ఉంటాయి. ఇవి కండరాల ఆరోగ్యానికి ఉపయోగపడుతాయి. అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది, ఇది శరీరంలో సెరోటోనిన్ ను మెలటోనిన్‌గా మార్చుతుంది తుంది, ఇది విశ్రాంతి, నిద్రను ప్రోత్సహిస్తుంది.
చేపలు..
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో సమృద్ధిగా ఉన్న చేపలు, ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడం, విశ్రాంతిని ప్రోత్సహించడం ద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చేపలు విటమిన్ "డి" మంచి మూలం, ఇది మంచి నిద్రకు అవసరమైనదిగా పరిగణిస్తారు.
బెర్రీలు
చెర్రీస్, ముఖ్యంగా టార్ట్ చెర్రీస్, మెలటోనిన్‌లో సమృద్ధిగా ఉంటాయి, ఇది నిద్ర చక్రాన్ని నియంత్రించే హార్మోన్. పడుకునే ముందు కొన్ని చెర్రీస్ తినడం లేదా టార్ట్ చెర్రీ రసం తాగడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
బాదం..
మెదడును పదును పెట్టడంలో బాదం కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో మెగ్నీషియం ఉంటుంది. ఇది నాణ్యమైన నిద్రను అందించడంలో మంచి పనితీరును కనబరుస్తుంది. మెగ్నీషియం కండరాలను సడలించడానికి, ప్రశాంతతను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది, నిద్రపోవడాన్ని సులభతరం చేస్తుంది.
ఇది కూడా చదవండి..వైద్యుల భరోసానే బాధితులకు ఔషధం..
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
