Bodybuilding Craze : యువత కిడ్నీలకు శాపంగా మారుతున్న బాడీ బిల్డింగ్ క్రేజ్..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రోజురోజుకూ యువతలో కండలు తిరిగిన శరీరం కోసం పాకులాట పెరిగిపోతోంది. ఆ వ్యామోహంలో పడి వారు చేస్తున్న తప్పులు ప్రాణాధారమైన కిడ్నీలనే దెబ్బతీస్తున్నాయి. జిమ్‌లో కఠోర శ్రమ చేస్తూ, నిపుణుల సలహా లేకుండా అధిక ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఓ అధ్యయనం ప్రకారం.. ఇటీవల 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న యువకులు కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. జిమ్‌కు వెళ్లే వారిలో దాదాపు 40 శాతం మంది త్వరగా శరీరాన్ని పెంచాలనే ఉద్దేశంతో 'హై ప్రోటీన్' ఆహారాన్ని అనుసరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

 

పెరుగుతున్న క్రియాటినిన్.. 

అధిక ప్రోటీన్ తీసుకుంటూ, తగినంత నీరు తాగకపోవడం వల్ల రక్తంలో క్రియాటినిన్ స్థాయిలు పెరుగుతున్నాయి. శరీరం వినియోగించు కోలేనంత ప్రోటీన్ తీసుకున్నప్పుడు, ఆ వ్యర్థాలను బయటకు పంపడానికి కిడ్నీలు శ్రమించాల్సి వస్తుంది. నీటి కొరత తోడైతే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.

క్రియేటిన్ ఎక్కువైతే ప్రమాదమే..!

బాడీ బిల్డింగ్‌లో ఎక్కువగా వాడే క్రియేటిన్ సప్లిమెంట్ల వల్ల కండరాలు వేగంగా క్షీణించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కండరాలు దెబ్బతిన్నప్పుడు విడుదలయ్యే 'మయోగ్లోబిన్' అనే ప్రోటీన్ మూత్రపిండాల సిరలను అడ్డుకుంటుంది. మూత్రం ముదురు గోధుమ రంగులో వస్తుంటే కిడ్నీలు వైఫల్యం చెందుతున్నాయని (Kidney Failure) గుర్తించాలి.

ముందస్తు లక్షణాలు ఎలా ఉంటాయి..? 

కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు కనిపించవు. అయితే ఈ మార్పులు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.త్వరగా అలసిపోవడం,ఆకలి మందగించడం, ఒంట్లో బరువుగా అనిపించడం, మూత్ర విసర్జనలో తేడాలు, ఏవైనా సప్లిమెంట్స్  తీసుకునే ముందు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. జిమ్ చేసే వారు సాధారణం కంటే ఎక్కువ నీరు తాగాలి. కృత్రిమ సప్లిమెంట్ల కంటే సహజ సిద్ధమైన ప్రోటీన్ ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించి, మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.

మధుమేహం, రక్తపోటు ఉన్నవారు కిడ్నీల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నెఫ్రాలజిస్టులు సూచిస్తున్నారు. "శరీరాకృతి ముఖ్యం కాదని కాదు.. కానీ అది కిడ్నీల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పొందేది కాకూడదని" వారు గుర్తు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.