Heart Valve Replacement : హార్ట్ వాల్వ్ రీప్లేస్మెంట్ కు రెండు పద్ధతులూ మేలే..! ఏడేళ్ల పరిశోధనలో వెల్లడైన కీలక అంశాలు..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి, ముఖ్యంగా కవాటాల మార్పిడి (Aortic Stenosis) అవసరమైన రోగులకు ఉపశమనం కలిగించే వార్త ఇది. గుండె కవాటాల మార్పిడిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు ప్రధాన చికిత్స విధానాలు 'టీఏవీఆర్' (TAVR.. శస్త్రచికిత్స లేని పద్ధతి) ట్రాన్స్‌కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ (TAVR) లేదా ట్రాన్స్‌కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (TAVI) అనేది గుండె కవాట సమస్యలకు చేసే ఆధునిక చికిత్సా విధానం. ఇందులో దెబ్బతిన్న అయోర్టిక్ వాల్వ్‌ను పూర్తిగా తొలగించకుండా, రక్తనాళాల ద్వారా ప్రత్యేక కాథెటర్ సహాయంతో గుండెలోకి చేరుకొని కవాటం వద్ద కొత్త కృత్రిమ వాల్వ్‌ను అమర్చుతారు.

ఈ విధానంలో ఛాతీని పూర్తిగా తెరిచి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం చాలా సందర్భాల్లో ఉండదు. కాబట్టి ఇది తక్కువ ప్రమాదంతో, త్వరగా కోలుకునే విధంగా ఉండే చికిత్సగా వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వయస్సు ఎక్కువగా ఉన్నవారు లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోలేని రోగులకు ఈ విధానం ప్రయోజనకరంగా ఉంటుంది. 'ఓపెన్ హార్ట్ సర్జరీ' రెండూ దీర్ఘకాలికంగా దాదాపు ఒకే రకమైన ఫలితాలను ఇస్తున్నట్లు తాజా అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. 'ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్'లో ప్రచురితమైన ఈ అధ్యయనం భారతీయ రోగులకు, వైద్యులకు కీలక మార్గదర్శిగా నిలవనుంది.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

ఏడేళ్ల పర్యవేక్షణ..  

తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్ అంటే గుండె కవాటం కుంచించు కుపోవడం. ఈ సమస్య ఉన్న వెయ్యి మంది రోగులపై ఏడేళ్ల పాటు ఈ అధ్యయనం సాగింది. చికిత్స తీసుకున్న వారిలో టీఏవీఆర్ గ్రూపులో 34.6శాతం, సర్జరీ గ్రూపులో 37.2శాతం మంది ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. ఈ స్వల్ప తేడా గణాంకాల పరంగా పెద్ద మార్పు కాదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రెండు పద్ధతుల్లోనూ అమర్చిన కవాటాలు ఏడేళ్ల తర్వాత కూడా ధృడంగా, సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. టీఏవీఆర్ విధానంలో 19.5శాతం, ఓపెన్ హార్ట్ సర్జరీలో 16.8శాతం గా నమోదైంది. స్ట్రోక్ బారిన పడే అవకాశాలు రెండు పద్ధతుల్లోనూ దాదాపు సమానంగా 8.1శాతం, 8.5శాతం ఉన్నాయి.

 రెట్టింపు సవాలు.. 

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతదేశంలో గుండె కవాటాల సమస్యలు భిన్నంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనదేశంలో అపరిశుభ్రత, ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే 'రుమాటిక్ హార్ట్ డిసీజ్' యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. నగరాల్లో వయసు పైబడటం వల్ల వచ్చే కవాటాల సమస్యలు పెరుగుతున్నాయి. తక్కువ వయసులోనే కవాటాల మార్పిడి అవసరమవుతున్న తరుణంలో, రాబోయే 20-30 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చికిత్సను ఎంచుకోవాలని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారు.

తేడాలు ఇవే..

పరిశోధనలో కొన్ని కీలక భేదాలు కూడా బయటపడ్డాయి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న వారిలో 43.5శాతం మందికి గుండె లయ తప్పే (Atrial Fibrillation) సమస్య తలెత్తగా, టీఏవీఆర్ రోగుల్లో ఇది 17.7శాతం మాత్రమే ఉంది.

పేస్ మేకర్ అవసరం.. దీనికి విరుద్ధంగా, టీఏవీఆర్ పద్ధతిలో చికిత్స పొందిన వారికి పేస్ మేకర్ అమర్చాల్సిన అవసరం 17.3శాతం ఎక్కువగా కనిపించింది. గుండె చికిత్స అనేది కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదు, అది జీవితకాల ప్రయాణం. సకాలంలో సరైన పద్ధతిని ఎంచుకోవడం ద్వారా రోగులు సాధారణ జీవితాన్ని గడపవచ్చని ఈ అధ్యయనం భరోసా ఇస్తోంది.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..  

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.