బ్రెయిన్ డెడ్  విషయంలో అవయవ దానం ఎలా చేస్తారు..?   

షేర్ చేయండి:
బ్రెయిన్ డెడ్  విషయంలో అవయవ దానం ఎలా చేస్తారు..?   

సాక్షి లైఫ్ : భారతదేశంలో అవయవాల కొరత కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది మరణిస్తున్నారు. ఒక్క కేరళలోనే దాదాపు లక్షన్నర మంది కిడ్నీల కోసం ప్రభుత్వ అవయవదాన స్వీకరణ వ్యవస్థ చెందిన ‘మృత సంజీవని’ పోర్టల్ లో తమ పేర్లను నమోదు చేసుకుని ఎదురుచూస్తున్నారు. భారతదేశం అవయవ దానంపై అవగాహన సరిగా లేకపోవడం వల్ల ఆర్గాన్ డోనర్స్ రేటు చాలా తక్కువగా ఉంది. అవయవ దానానికి సంబంధించిన చట్టాలు కూడా ఇందుకు ప్రధాన కారణం. 

ఇది కూడా చదవండి..ఔషధాలతో పని లేకుండా చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చా..?

ఇది కూడా చదవండి..ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?

 

అవయవ దానం సమ్మతి పత్రం.. 

భారతదేశంలో మరణానికి ముందు అవయవ దానం సమ్మతి పత్రం ఇచ్చినప్పటికీ, అవయవ దానం విషయంలో మృతుని బంధువుల సమ్మతితో మాత్రమే చేస్తున్నారు. ఒకవేళ వాళ్లు ఒప్పుకోకపోవడం వల్ల వారు అవయవదానం చేసేందుకు ముందుకు రావడంలేదు. 

 కోమాలోకి వెళ్లిన వ్యక్తి విషయంలో.. 

ఎప్పటికీ కోలుకోలేని తీవ్రమైన స్పృహ కోల్పోవడం అంటే కోమాలోకి వెళ్లడం. మెదడు సహజ ప్రతిస్పందనలు లేకపోవడం, శ్వాస సామర్థ్యం పూర్తిగా కోల్పోవడం వంటివి ఒక వ్యకిలో కనిపిస్తే బ్రెయిన్ డెత్ గా నిర్ధారిస్తారు. 100 శాతం ఖచ్చితత్వంతో ఆరు గంటల వ్యవధిలో అప్నియా పరీక్ష చేస్తారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్యానెల్‌లోని ఇద్దరు వైద్యులతో సహా నలుగురు నిపుణులైన వైద్యులు ఉంటారు. ఈ పరీక్షలు జరిపేటప్పుడు వీడియో రికార్డ్ చేస్తారు.

బ్రెయిన్ డెత్‌.. 

బ్రెయిన్ డెత్‌కు దారితీసే కారణాలలో రోడ్డు ప్రమాదాలు చాలా ముఖ్యమైనవి. ప్రతి సంవత్సరం సుమారు లక్షన్నర మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. కానీ మన దేశంలో బ్రెయిన్ డెత్ తర్వాత అవయవ దానం చేసే వారి సంఖ్య చాలా తక్కువ. 2017లో భారతదేశం అంతటా 907 ట్రాన్స్ ప్లాంట్లు మాత్రమే జరిగాయి. ఒక సంవత్సరంలో 5 లక్షల అవయవాలు అవసరం ఉండగా 10వేల నుంచి 15వేల అవయవాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలోని NOTTO (నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్) ద్వారా అవయవ దానం నిర్వహిస్తారు.

జీవితాలకు వెలుగులు.. 

మరణానంతరం ఒక వ్యక్తి అవయవ దానం చేస్తే ఏడుమందికి అవయవాలు ఉపయోగపడతాయి. అవయవ దానం చేయడం వల్ల లక్షలాది మంది జీవితాలకు వెలుగులు ప్రసాదించినట్లువుతుంది. కాబట్టి అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.