పంటి నొప్పి లేదా చిగురు వాపు వస్తే దంతాలకు పెయిన్ బామ్ వంటివి రాయకూడదా..?
సాక్షి లైఫ్ : చిన్నారుల దంతాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి..దంతాలు వచ్చినా, రాకపోయినా శిశువులు పాలు తాగిన తర్వాత నోరంతా శభ్రంగా కడగాలి. వేలితో చిగుళ్లను మర్దన చేయాలి. పాల సీసా పీకను నోట్లోనే ఉంచి నిద్రపుచ్చకూడదు. దేనినైనా తిన్న తర్వాత పుక్కిలించి ఊయడం, నోటిని శుభ్రం గా కడుక్కోవడం వంటి పనులను పిల్లలకు అలవాటు చేయాలి.
ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు..
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?
ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..
పిల్లలకు శాస్త్రీయంగా ఎలా పండ్లు తోమాలో తల్లిదండ్రులే దగ్గరుండి నేర్పించాలి. కిందిపండ్లు పైకి, పై పండ్లు కిందికి బ్రష్ చేయాలి. పెద్దలు వాళ్ళు కూడా బ్రష్‌ని ప్రతి మూడు నెలలకోసారి మార్చాలి. పంటి నొప్పి లేదా చిగురు వాపు వస్తే దంతానికి పెయిన్ బామ్ వంటివి రాయకూడదు. పంటి సందుల్లో పుల్లలు, పిన్సీసులు వంటివి పెట్టి కెలకకూడదు. పాన్, గుట్కా ఇతర పొగాకు ఉత్పత్తులను నమలకూడదు.
గరుకైన పొడులను, గట్టిగా ఉండే బ్రష్‌లను దంతాలు శుభ్రంచేయడానికి ఉపయోగించకూడదు. అతి చల్లగా కానీ లేదా అతి వేడిగా ఉండే పదార్థాలను, పానీయాలను పంటికి తగలకుండా జాగ్రత్తపడితే మంచిది. దంతాలకు వైద్యం చేయించు కుంటే చూపు మందగి స్తుందని చాలామంది అనుకుంటారు.
ఇది పెద్ద అపోహ. పంటి నరాలకు, కంటి నరాలకు సంబంధమే లేదు. పండ్లు పుచ్చిపోవడానికి పురుగులు కారణం అనుకుంటారు. అది కూడా తప్పే. పండ్లు పుచ్చిపోవడానికి అసలు కారణం సూక్షజీవులే.
దంతాలను, చిగుళ్లను అన్ని వైపులా శుభ్రంచేసుకోక పోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. మనం తిన్న ఆహారం పండ్లలో ఇరుక్కుపోయి కుళ్లిపోయి దంత సమస్యలు వస్తాయి. అందుకే చిగుళ్లు వాయడం, రక్తంకారడం జరుగుతుంది. పళ్లు పుచ్చిపోవడం మరో సమస్య. పుచ్చడం ప్రారంభంలోనే గుర్తించి చికిత్స చేయించుకోవాలి. మధుమేహం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండకపోతే మరింత ప్రమాదం. కాబట్టి దంత సంరక్షణలో అవసరమైన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యంగా ఉండండి.
ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్ పెంచే బెస్ట్ ఫుడ్..?
ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
