Broccoli : బ్రకోలీ తినడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : బ్రకోలీలో విటమిన్ "కె" ఎక్కువగా ఉంటుంది. విటమిన్ "కె" రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. ఒకవేళ రక్తాన్ని పలుచబరిచే మందులు తీసుకునే వారు బ్రకోలీ తినడం వల్ల ఆయా మందుల ప్రభావం తగ్గుతుంది. అంతేకాదు ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో రక్తాన్ని పలుచబరిచే మందులు తీసుకునేవాళ్ళు తప్పనిసరిగా బ్రకోలీని తీసుకునే ముందు వైద్యనిపుణులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..పరోక్సిస్మల్ నాక్టర్నల్ డిస్ప్నియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే
ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
కిడ్నీలో రాళ్లు ఉన్న బాధితులు..
కిడ్నీలో రాళ్లు ఉన్నబాధితులు బ్రకోలీ ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. బ్రకోలీలో పొటాషియం ఉంటుంది, ఇది కొన్ని రకాల మూత్రపిండాల్లో రాళ్లను కలిగిస్తుంది. దీనితో పాటు, బ్రకోలీలో ఆక్సలేట్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియంతో కలిపి రాళ్లను ఏర్పరచడంలో సహాయపడుతుంది. మీకు ఏదైనా మూత్రపిండాల సంబంధిత సమస్య ఉంటే, మీ ఆహారంలో బ్రకోలీని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి.
గర్భిణీ స్త్రీలు..
గర్భధారణ సమయంలో బ్రకోలీ ప్రయోజనకరంగా పరిగణిస్తారు, కానీ దానిని అధికంగా తినడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. పచ్చిగా లేదా ఎక్కువగా బ్రకోలీ తినడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్ణ సమస్యలు వస్తాయి. దీని కారణంగా గర్భిణీ స్త్రీలకు అసౌకర్యంగా ఉంటుంది. అందువల్ల, గర్భధారణ సమయంలో బ్రకోలీని పరిమిత పరిమాణంలో తినడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..మేనరికం పెళ్లిళ్లు: పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
