బొద్దింకల కారణంగా అలెర్జీలు వస్తాయా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : బొద్దింకలు వాటి లాలాజలం, మలం, వాటిచర్మంపై విడిచిన పొట్టు వంటివి అలెర్జీకి కారణమవుతాయి. ఇలాంటి కారకాలను పీల్చినప్పుడు లేదా వాటితో చర్మం తాకినప్పుడు కొందరిలో అలెర్జీ రియాక్షన్స్ వస్తాయి.పిల్లల్లో ఆస్తమాకు బొద్దింకల అలెర్జీ ఒక ముఖ్యమైన కారణం. బొద్దింకల ట్రోపోమియోసిన్ అనే ప్రొటీన్ అలెర్జీలకు కారణమవుతుంది. మీ ఇంట్లో బొద్దింకల సమస్య ఉంటే, వాటిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా అలెర్జీల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

కలరా .. 

బొద్దింకలు కలరాకు కారణమయ్యే బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తాయి. దీని ప్రధాన లక్షణం విరేచనాలు, ఇది శరీరంలో తీవ్రమైన డీహైడ్రేషన్ ను కలిగిస్తుంది.  

గ్యాస్ట్రోఎంటెరిటిస్ , అలెర్జీలు..  

గ్యాస్ట్రోఎంటెరిటిస్ అంటే కడుపు సంబంధిత సమస్య. ఇది బొద్దింకల వల్ల తలెత్తే సమస్య. వాంతులు, విరేచనాలు, కడుపులో అసౌకర్యం కలగడం దీని ప్రధాన లక్షణాలు. బొద్దింక లాలాజలం, మలం,శరీర భాగాలు గాలిలో కలిసిపోవడం వల్ల ఉబ్బసం, అలెర్జీ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పిల్లలలో తుమ్ములు, దగ్గు, శ్వాస సమస్యలు పెరుగుతాయి. దీని కోసం, వైద్యనిపుణులుఅవసరమైన చికిత్స అందిస్తారు.

 

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.