శ్వాస లేదా గుండె ఆగిపోతే సిపిఆర్ ద్వారా ప్రాణాలను కాపాడవచ్చా..?
సాక్షి లైఫ్ : సిపిఆర్ ను కార్డియోపల్మోనరీ రిససిటేషన్ అంటారు. గుండె కొట్టుకోవడం ఆగిపోతే దానిని కార్డియాక్ అరెస్ట్ అంటారు. గుండె ఆగిపోయినప్పుడు అత్యవసరంగా సిపిఆర్ చేస్తారు. దీని ద్వారా ఒక వ్యక్తి శ్వాస లేదా గుండె ఆగిపోతే, అతని ప్రాణాలను కాపాడవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోతే చనిపోయినట్లుగా భావిస్తారు. కానీ ఇలాంటి పరిస్థితి ఒక్కోసందర్భంలో తొక్కిసలాట లేదా ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా వ్యక్తి శ్వాస లేదా ఊపిరి ఆగిపోయే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా గుండె ఆగిపోయే సమయంలో గుండె మెదడు, ఊపిరితిత్తులతో సహా శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తాన్ని పంప్ చేయలేదు. సమయానికి చికిత్స అందించకపోతే నిమిషాల్లో చనిపోయే ప్రమాదం ఉంటుంది. సిపిఆర్ చేసే క్రమంలో బాధితుల ఛాతీపై నొక్కడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా బాధితులను సులభంగా రక్షించవచ్చు.
ఇది కూడా చదవండి..ఆల్కహాల్ దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?
ఇది కూడా చదవండి..శీతాకాలంలో బరువు ఎందుకు పెరుగుతారో తెలుసా..?
ఇది కూడా చదవండి..అధ్యయనంలో వెల్లడైన నిజాలు : మద్యం సేవించడం వల్ల ఒత్తిడి తగ్గుతుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
