అధ్యయనంలో వెల్లడైన నిజాలు : మద్యం సేవించడం వల్ల ఒత్తిడి తగ్గుతుందా..? 

షేర్ చేయండి:
అధ్యయనంలో వెల్లడైన నిజాలు : మద్యం సేవించడం వల్ల ఒత్తిడి తగ్గుతుందా..? 

సాక్షి లైఫ్ : మీరు ఆందోళన, ఒత్తిడిని తగ్గించుకోవడానికి మద్యం సేవిస్తు న్నారా..? అయి ఇది మీ కోసమే. మద్యం సేవించడం వల్ల ఎలాంటి ప్రభావాలుంటాయనే దానిపై తాజాగా జరిగిన అధ్యయనాలు కొత్త విషయాలను బయట పెట్టాయి. అయితే మద్యం తాగినప్పుడు మీ ఆందోళనను కొంచెం తగ్గించినప్పటికీ, దాని ప్రభావం కొద్దికాలం మాత్రమే ఉంటుందని అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. మద్యం మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..న్యూ స్టడీ : లంగ్ క్యాన్సర్ ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తోంది..? 

ఇది కూడా చదవండి..స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే జన్యుపరమైన అంశాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై లాన్సెట్ తాజా అధ్యయనం..

మద్యం, మానసిక అలసట : నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో ఒత్తిడి ,మానసిక అలసట ఒక సాధారణ సమస్యగా మారాయి. ఆఫీసు పనులు, కుటుంబ బాధ్యతలు, సామాజిక ఒత్తిళ్ల మధ్య, చాలామంది తరచుగా తమ మనసును ప్రశాంతపరచుకోవడానికి వివిధ పద్ధతులను ఆశ్రయిస్తూ ఉంటారు.

అటువంటి పద్ధతుల్లో ఒకటి మద్యం సేవించడం. మద్యం తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, మానసిక అలసట నుంచి ఉపశమనం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ మద్యం నిజంగా మానసిక అలసటను తగ్గిస్తుందా? ఇటీవలి అధ్యయనం ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనడానికి ప్రయత్నించింది. దాని ఫలితాలు ఎలా ఉన్నాయంటే..? 


మద్యం సేవించిన తర్వాత, మద్యం మీ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే, అది మీ మనస్సు, శరీరాన్ని వెంటనే ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. మొదట్లో మీకు కొంతసేపు ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా అనిపించవచ్చు, ఎందుకంటే ఆల్కహాల్ మీ హృదయ స్పందనను నెమ్మదింప చేస్తుంది. అంతేకాదు మీ కార్యకలాపాలను తగ్గిస్తుంది. ఇది ఎప్పుడంటే..? మీరు మొదటిసారి మద్యంతాగినప్పుడు ప్రశాంతంగా ఉంచడమేకాకుండా, ఆందోళనను తాత్కాలికంగా తగ్గిస్తుంది.ఈ ప్రభావం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. 

 పరిశోధనల ప్రకారం, ఆందోళన రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులలో మద్యం తాగినప్పుడు ఆందోళన లక్షణాలను తగ్గించవచ్చు, అయితే ఈ ఉపశమనం తాత్కాలికమే. మద్యం ఆందోళనకు శాశ్వత పరిష్కారం కాదు. వాస్తవానికి, ఇది దీర్ఘకాలంలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.