Collagen : ఏ ఏజ్ గ్రూప్ వాళ్లకు కొల్లాజెన్ అవసరం..?  

షేర్ చేయండి:
Collagen : ఏ ఏజ్ గ్రూప్ వాళ్లకు కొల్లాజెన్ అవసరం..?  

సాక్షి లైఫ్ : కొల్లాజెన్ (Collagen) అనేది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన ప్రోటీన్లలో ఒకటి. ఇది చర్మానికి, ఎముకలకు, కీళ్లకు, కండరాలకు ఒక నిర్మాణాన్ని, దృఢత్వాన్ని ఇస్తుంది. అయితే, ఏ వయసు నుంచి మన శరీరానికి కొల్లాజెన్ అవసరం మొదలవుతుంది? శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, చర్మాన్ని దీర్ఘకాలం యవ్వనంగా ఉంచడానికి కొల్లాజెన్ అనే ప్రోటీన్ చాలా ముఖ్యం.

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..? 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

శరీరం స్వయంగా కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, దాని ఉత్పత్తి వయస్సు పెరిగే కొద్దీ తగ్గడం ప్రారంభమవుతుంది. కొల్లాజెన్ లోపం వల్ల కీళ్ల నొప్పులు, చర్మంముడతలు పడడం జరుగుతుంది. 30 ఏళ్ల తర్వాత ఈ కొల్లాజెన్ అనే ప్రోటీన్ శరీరానికి ఎందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం..  

స్కిన్ అండ్ హెయిర్..

వయస్సు పెరిగేటప్పుడు శరీరంలో కొల్లాజెన్‌ను  తగ్గకుండా చూసుకోవాలి.శరీరంలో కొల్లాజెన్ స్థాయి తగ్గినప్పుడు చర్మం ముడతలు పడడం, మొటిమలు రావడం, ఎముకలు కూడా బలహీనపడటం మొదలవుతుంది. శరీరంలో కొల్లాజెన్ లోపం కారణంగా చర్మం, జుట్టుతో పాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.


కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. ఇది కండరాలు, కీళ్ళు, చర్మం, జుట్టు, గోళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనది. మన శరీరం దానిని సహజంగా ఉత్పత్తి చేస్తుంది. కానీ వయస్సు పెరుగుతున్నకొద్దీ ఈ ప్రక్రియ మందగిస్తుంది. కొల్లాజెన్ లోపిస్తే అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ప్రతి ఒక్కరికి 30 ఏళ్ల తర్వాత ఇది చాలా ముఖ్యమని చెబుతున్నారు వైద్యనిపుణులు. 

బోన్ హెల్త్ కోసం.. 
 
వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో గట్టితనం తగ్గడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో కీళ్లలో నొప్పిగా అనిపిస్తుంది. దీనికి కొల్లాజెన్ లోపించడమే ఇందుకు కారణం కావచ్చు. శరీరంలో దీని లోపం వల్ల కీళ్లనొప్పులు, వాపు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

 
 జీర్ణవ్యవస్థపై.. 

శరీరంలో కొల్లాజెన్ లోపం ఉంటే, దాని ప్రభావం జీర్ణవ్యవస్థపై కూడా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో కడుపులో మంట, సరిగా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 30 సంవత్సరాల వయస్సు తర్వాత దానికి సంబంధించిన సప్లిమెంట్లను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 

మజిల్ స్ట్రెంత్..  

కండరాలను దృఢంగా మార్చడంలో కూడా కొల్లాజెన్ చాలా బాగా  ఉపయోగపడుతుంది. అటువంటి పరిస్థితిలో ముఖ్యంగా 30 సంవత్సరాల వయస్సులో పనిచేసే వ్యక్తులు, శరీరంలోని శక్తి స్థాయిని నిర్వహించడానికి కొల్లాజెన్ చాలా అవసరం. కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకునే వ్యక్తులకు అదనపు కొవ్వు సమస్య ఉండదు. అంతేకాదు కండరాలు కూడా దృఢంగా ఉంటాయి.

స్కిన్-హెయిర్ కు.. 

శరీరంలో కొల్లాజెన్ సరైన మొత్తంలో ఉన్నప్పుడు, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలనుకుంటే, మీ వయస్సు పెరిగే కొద్దీ కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకోవడం చాలా అవసరం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. తద్వారా  ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారించవచ్చు. అటువంటి పరిస్థితిలో జుట్టు రాలే సమస్య ఉండదు. అంతేకాదు జుట్టు మందంగా, బలంగా మారుతుంది. కొల్లాజెన్ కు సంబంధించిన సప్లిమెంట్లు చర్మం పొడిబారడాన్ని తొలగించడంతోపాటు, సహజమైన మెరుపును తీసుకురావడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.