Belly Fat : మీ వయసు ముప్పై దాటిందా? జాగ్రత్త.. మీరు తినే ఆహారం బెల్లీ ఫ్యాట్ గా మారే ప్రమాదం..!

షేర్ చేయండి:
Belly Fat : మీ వయసు ముప్పై దాటిందా? జాగ్రత్త.. మీరు తినే ఆహారం బెల్లీ ఫ్యాట్ గా మారే ప్రమాదం..!

సాక్షి లైఫ్ : గతంలో ఎంత తిన్నా బరువు పెరగలేదని, కానీ ఇప్పుడు ఏది తిన్నా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతోందని ఆందోళన చెందుతున్నారా? మీరు తినే తిండిలో మార్పు లేకపోయినా, మీ శరీరంలో నిశ్శబ్దంగా ఒక మార్పు చోటుచేసుకుంటోంది. 30 ఏళ్ల వయసు అనేది మన జీవక్రియ (metabolism) మలుపు తిరిగే కీలక దశ అని హార్వర్డ్ అండ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ చెబుతున్నారు. ముప్పై ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది? వయసు 30 దాటిన తర్వాత మన శరీరం క్రమంగా తన సహజ స్వభావాన్ని మార్చుకుంటుంది. దీనికి ప్రధాన కారణాలు ఇవే..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

కండరాల క్షీణత (Sarcopenia).. 30 ఏళ్ల తర్వాత ప్రతి దశాబ్దానికి 3 నుంచి 8 శాతం కండరాల సాంద్రత తగ్గిపోతుంది. కండరాలు విశ్రాంతి సమయంలో కూడా క్యాలరీలను ఖర్చు చేస్తాయి. అవి తగ్గడం వల్ల మనం తిన్న ఆహారం శక్తిగా మారకుండా, కొవ్వుగా నిల్వ ఉండిపోతుంది. ప్రతి పదేళ్లకూ శరీరంలో ఇన్సులిన్ పనితీరు 4-5 శాతం తగ్గుతుంది. ఫలితంగా రక్తంలోని గ్లూకోజ్ కణాలకు చేరక, ముఖ్యంగా పొట్ట భాగంలో (Visceral Fat) కొవ్వుగా పేరుకుపోతుంది. గ్రోత్ హార్మోన్, టెస్టోస్టెరాన్ లేదా ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గి, 'కార్టిసాల్' (ఒత్తిడి హార్మోన్) పెరగడం వల్ల నడుము చుట్టూ కొవ్వు చేరుతుంది.

ఈ లక్షణాలు మీలో ఉన్నాయా..?

మీ మెటబాలిజం నెమ్మదించిందని తెలిపే కొన్ని సంకేతాలు

బరువు పెరగకపోయినా, పొట్ట సైజు పెరగడం.

మధ్యాహ్నం వేళ విపరీతమైన నీరసం (Energy crashes).

పిండి పదార్థాలు (Carbs) తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం.

తీపి పదార్థాలపై కోరిక (Sugar cravings) విపరీతంగా పెరగడం.

నిపుణులు సూచించే పరిష్కార మార్గాలు ఏమిటి..? 

మారిన జీవక్రియకు అనుగుణంగా మన జీవనశైలిని మార్చుకోవడం తప్పనిసరి. ప్రతిరోజూ శరీర బరువులో కిలోకు 1.2 నుంచి 1.6 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలి. ఇది కండరాల సాంద్రతను కాపాడుతుంది. వారానికి కనీసం మూడు సార్లు బరువులెత్తే వ్యాయామాలు (Strength training) చేయాలి.ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాల నడక ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. రోజుకు 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. గమనిక ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు తీసుకోవడం ఉత్తమం.

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.