Ultra-Processed Foods More Dangerous : 'అల్ట్రా ప్రాసెస్డ్' ఫుడ్ సిగరెట్స్ తాగడం కంటే ప్రమాదకరం..
సాక్షి లైఫ్ : నేటితరం ఉరుకులు, పరుకుల జీవితంలో మనకు తెలియ కుండానే మనం 'అల్ట్రా ప్రాసెస్డ్' ఆహారానికి బానిసలవుతున్నాం. అయితే, ఈ అలవాటు చుట్టూ పొంచి ఉన్న ముప్పుపై అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తాజాగా ఒక సంచలన హెచ్చరిక జారీ చేశారు. అతిగా శుద్ధి చేసిన ఆహార పదార్థాలు సిగరెట్ల మాదిరిగానే 'సైలెంట్ కిల్లర్స్' అని పరిశోధకులు తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..!
ఈ అధ్యయనంలో..
తాజాగా నిర్వహించిన ఒక విస్తృత పరిశోధనలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను ధూమపానంతో పోల్చారు శాస్త్రవేత్తలు. ధూమపానం ఊపిరితిత్తులను ఎలా దెబ్బతీస్తుందో, ఈ కృత్రిమ ఆహారాలు గుండె, మెదడు, జీవక్రియలను అలానే చిన్నాభిన్నం చేస్తున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు.
ముప్పు ఉన్న ఆహారాలు ఇవేనట..!
మనం రోజూ సరదాగా తినే పదార్థాలు మన ఆయువును తగ్గిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి వాటిలో కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ వంటివి వీటిలో ఉన్నాయి. ఇలాంటి ఫుడ్స్ లో ఉండే అధిక చక్కెరలు కాలేయాన్ని దెబ్బతీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
ప్యాక్ చేసిన స్నాక్స్ ఫుడ్స్.. చిప్స్, బిస్కెట్లు, కుకీలు. ఇన్ స్టంట్ నూడుల్స్, సూప్స్ కూడా ప్రమాదమేనట.. ఇలాంటివి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వాడే రసాయనాలు క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ప్రాసెస్డ్ మీట్.. హామ్, సాసేజ్‌లు వంటి మాంస ఉత్పత్తులు.
రెడీ-టు-ఈట్ మీల్స్..కేవలం మైక్రోవేవ్ లో వేడి చేసి తినే ఆహార పదార్థాలు.
ఆరోగ్యంపై అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రభావం ఎలా ఉంటుంది..?
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ముప్పై రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. ఇలాంటి బ్యాడ్ ఫుడ్ తినడం వల్ల ధమనులలో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం 50శాతం పెరుగుతుంది.అధిక ఆందోళన (Anxiety) డిప్రెషన్‌కు ఇవి దారితీస్తాయి. ఊబకాయం, మధుమేహం..ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్-2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది. మెదడు పనితీరు మందగించి జ్ఞాపకశక్తి తగ్గడంతోపాటు అల్జీమర్స్ వంటి సమస్యలు త్వరగా వచ్చే ప్రమాదం ఉంది.
ప్యాకెట్ల రూపంలో లభించే ఆహారం కంటే..
ప్యాకెట్ల రూపంలో లభించే ఆహారం కంటే, ఇంట్లో తయారు చేసుకున్న తాజా ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం. ప్యాకెట్ వెనుక ఉండే 'Ingredients' జాబితాలో మీకు తెలియని రసాయన పేర్లు ఎక్కువగా ఉంటే, అలాంటివి తినకపోవడమే మంచిది. రుచికి అలవాటు పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కంటే, ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడమే ఉత్తమ మార్గమని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
