'డెంగీ -ఆల్' వ్యాక్సిన్ : డెంగీ బాధితులకు కొత్త ఆశాకిరణం..
సాక్షి లైఫ్ : వర్షాకాలంలో వచ్చిందంటే చాలు.. భారతదేశంలో డెంగీ ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది దీని బారీన పడి, అనారోగ్యానికి గురవుతున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. డెంగీని నిర్మూలించడానికి సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, మరణాలను గణనీయంగా తగ్గించవచ్చు. అందుకోసం రూపొందించిన 'డెంగీ -ఆల్' వ్యాక్సిన్ ను భారతదేశంలో సీజనల్ వ్యాధులపై చేసే పోరాటంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకువస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
శాస్త్రీయ పరమైన ఆధారాలు..
ట్రయల్స్ పూర్తయిన తర్వాత, శాస్త్రీయ పరమైన ఆధారాలను సమీక్షించి, ఔషధ నియంత్రణ సంస్థల ఆమోదం లభించాక, ఈ వ్యాక్సిన్ రాబోయే రెండు సంవత్సరాలలో ప్రజలకు అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు పరిశోధకులు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎమ్ ఆర్), వ్యాక్సిన్ తయారీదారులతో కలిసి, సరసమైన ధరలకు ఈ వ్యాక్సిన్ ను అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.
వైద్య పరిశోధన ..
ఈ క్లినికల్ ట్రయల్ భారతదేశం వైద్య పరిశోధన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. సమన్వయ ప్రయత్నాలు, ప్రపంచ భాగస్వామ్యాలతో, భారతదేశం ఉష్ణమండల వ్యాధుల నివారణలో ముందుంటుందని నిపుణులు భావిస్తున్నారు. డెంగీ ప్రమాదంలో ఉన్న లక్షలాది మందికి, 'డెంగీ -ఆల్' ఎంతగానో ఉపయోగపడనుంది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
