గుండెపోటు రాకుండా ఉండాలంటే ఈ ఐదు పనులు తప్పకుండా చేయండి.
సాక్షి లైఫ్ : ఇటీవల యువకులతో సహా ఎక్కువ మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. కొందరు గుండె ఆరోగ్యంపై సరైన శ్రద్ధ చూపడం లేదు. దీంతో గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. గుండెపోటు రాకుండా ఉండాలంటే ఈ ఐదు పనులు తప్పకుండా చేయండి..ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉండే వాటిలో ఎక్కువ శాతం ప్రాసెస్ చేసిన ఆహారమే. దీని కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహారం, బేకరీ, బర్గర్‌లు, పిజ్జా, పిండి, పంచదార ఉన్న అన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండండి.
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?
శరీరానికి తగిన వ్యాయామం లేకపోతే ఆ ప్రభావం గుండెపై కూడా పడుతుంది. కాబట్టి వాకింగ్ చేయండి, వారానికి కనీసం మూడు రోజులు 45 నిమిషాలపాటు తప్పనిసరిగా నడవండి.
ఒత్తిడి కారణంగా బిపి, మధుమేహం వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కనుక ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేస్తూ ఉంటే, ఒత్తిడి నిర్వహణపై దృష్టి పెట్టండి. అందుకోసం ప్రతిరోజూ ధ్యానం చేయడం ఉత్తమం.
అధిక బరువు కారణంగా శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు పలురకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధిక బరువు విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మీరు ప్రతిరోజూ చేసే పనుల నుంచి విరామం తీసుకోండి, మీ మనస్సుకు విరామం అవసరం. అందుకోసం శరీరానికి సరిపడా నిద్ర చాలా అవసరం. నిద్రలేమి సమస్య మానసిక, శారీరక సమస్యలతోపాటు పలురకాల వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ప్రతి రోజూ సరిపడా నిద్ర చాలా అవసరం.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
