ఆరోగ్యంగా కనిపించే అనారోగ్యకరమైన ఆహారాలు..
సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. అందుకోసం ప్రజలు తమ ఆహారంలో అనేక ఆరోగ్యకరమైన ఆహారాలు, పానీయాలను చేర్చుకుంటూ ఉంటారు. అయితే పైకి ఆరోగ్యంగా అనిపించే కొన్నిరకాల ఆహారాలు ఆరోగ్యానికి హానికలిగిస్తాయని మీకు తెలుసా..? ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మీకు అనారోగ్యకరమైనవిగా భావించే కొన్ని అనారోగ్యకరమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. వ్యాధులు రాకుండా పలురకాల జాగ్రత్తలు, మంచి పోషకాహారం తీసుకుంటారు. శరీరానికి విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ వంటి పోషకాలు అవసరం..వీటిని పొందడానికి అనేక ఆరోగ్యకరమైన ఆహారాలు, పానీయాలను తీసుకుంటాము. మార్కెట్‌లో లభించేవన్నీ ఆరోగ్యకరమైన ఆహారాలేనా..? కాదా..?
ఇది కూడా చదవండి.. ఉమెన్స్ డే- 2024: ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? ఇవిగో టిప్స్..
డైజెస్టివ్ బిస్కెట్స్ ..
డైజెస్టివ్ అనే పేరుతో కొన్ని కంపెనీలు బిస్కెట్లు తయారు చేసి అమ్ముతుంటాయి. ఈ బిస్కెట్లు చాలా హానికరం. డైజెస్టివ్ బిస్కెట్లు పిండి, చక్కెరతో తయారవుతాయి. వీటిలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. వీటిని రోజూ తీసుకుంటే బరువు పెరిగి పలు అనారోగ్య సమస్యల బారీన పడే అవకాశం ఉంది.
పానీయాలు..
చాలా మంది తమ పిల్లలకు శక్తినిచ్చే పలు రకాల పౌడర్లను కలిపి ఇస్తారు. ఇలాంటివాటిలో విటమిన్లు , మినరల్స్ ఉంటాయని భావిస్తారు. కానీ ఇటువంటి పౌడర్లలో అనారోగ్యకరమైన కారకాలు ఉంటాయి. వీటిలో చక్కర కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు పౌడర్ ఎక్కువ కాలం నిల్వా ఉండడానికి రకరకాల రసాయనాలు కలుపుతారు. ఇవి పెరిగే పిల్లలకు ఏమాత్రం మంచివి కాదు.
బ్రౌన్ బ్రెడ్..
వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యకరమైనదని చాలా మంది అనుకుంటారు, అయితే ఈ బ్రౌన్ బ్రెడ్ కూడా వైట్ బ్రెడ్ లాగా అనారోగ్యకరమైనదని మీకు తెలుసా..? ఎందుకంటే దీని తయారీలో రంగులు ఉపయోగిస్తారు. కాబట్టి బ్రౌన్ బ్రేడ్ ఆరోగ్యకరమైనది కాదు.
ఇది కూడా చదవండి.. మధుమేహాన్ని నియంత్రించే అద్భుతమైన పండ్లు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
