Super Flu : సూపర్ ఫ్లూ ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి..? నివారణ ఎలా..?
సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా కలవరం రేపుతున్న సూపర్ ఫ్లూ (ఇన్‌ఫ్లుయెంజా–A, H3N2) వైరస్ సాధారణ ఫ్లూతో పోలిస్తే కొన్ని తీవ్రమైన లక్షణాలు కలిగి ఉంటోంది. ‘సూపర్ ఫ్లూ’ వైరస్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణ ఫ్లూతో పోలిస్తే లక్షణాలు తీవ్రమవడంతో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరి ఈ సూపర్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి..? ఎవరికి ఎక్కువ ప్రమాదం..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఈ వైరస్ బారిన పడిన వారిలో కొన్నిరకాల లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన జ్వరం..ఒక్కసారిగా ఒళ్లు కాలిపోయేలా జ్వరం రావడం. ఎడతెరపి లేని దగ్గు.. గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. అలసట.. విపరీతమైన నీరసం, ఒళ్లు నొప్పులు. చలివణుకుతో కూడిన జ్వరం. కొందరిలో వాంతులు, విరేచనాలు కూడా కనిపిస్తున్నాయి.
ఎవరికి ఎందుకు ప్రమాదకరం..?
సాధారణంగా ప్రతి ఏటా ఫ్లూ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి. అయితే, ఈ ఏడాది వ్యాప్తి చెందుతున్న ఈ కొత్త వేరియంట్ (Subclade K), ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ల ప్రభావం నుంచి తప్పించుకునే శక్తిని కలిగి ఉన్నట్లు వైద్య నిపుణులు భావిస్తున్నారు. అందుకే టీకా తీసుకున్న వారిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గి, ప్రాణాపాయం తప్పుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
మాస్క్ తప్పనిసరిగా ఉండాలి..రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ ధరించడం మేలు.పరిశుభ్రత..తరచూ చేతులను సబ్బుతో లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.దూరం పాటించాలి..అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండటం మంచిది. తగినంత విశ్రాంతి..శరీరానికి తగిన విశ్రాంతినిస్తూ, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. సొంత వైద్యం అస్సలు తీసుకోవద్దు.. ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
