నకిలీ తేనెను ఎలా తయారు చేస్తారో తెలుసా..?
సాక్షి లైఫ్ : ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే నకిలీ తేనెలో, రిఫైన్డ్ షుగర్ సిరప్ కలుపుతున్నారు. ఆశ్చర్యకరంగా, ఈ షుగర్ సిరప్‌ను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇది చూడడానికి, రుచికి అచ్చం అసలు తేనె లాగే ఉంటుంది, అందుకే అసలుతేనె, నకిలీ తేనె మధ్య తేడాను గుర్తించడం కష్టమవుతోంది.
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
కల్తీ తేనెను ఎలా గుర్తించాలి..?
కొన్ని సులభమైన చిట్కాలతో తేనె స్వచ్ఛతను పరీక్షించుకోవచ్చు.
ప్లేట్ పరీక్ష: ఒక ప్లేట్‌లో కొద్దిగా తేనె వేసి, అందులో కొన్ని నీళ్లు కలపండి. ఇప్పుడు ప్లేట్‌ను మెల్లగా వృత్తాకారంలో తిప్పండి.
అసలు తేనె అయితే: తేనె గరిగా మారి, ఓ రకమైన ఆకారంలో ఒక నమూనా ఏర్పడుతుంది.
నకిలీ తేనె అయితే: అది వెంటనే నీటిలో కలిసిపోతుంది, ఏ విధమైన ఆకారం ఏర్పడదు.
నీటి పరీక్ష: ఒక గ్లాసులో నీరు తీసుకొని, అందులో ఒక స్పూన్ తేనె వేయండి.
అసలు తేనె అయితే: అది నీటి అడుగు భాగానికి వెళుతుంది. వెంటనే నీటిలో కలవదు.
నకిలీ తేనె అయితే: నీటిలో వేసిన వెంటనే కరిగిపోతుంది లేదా వెంటనే నీటిలో కలిసిపోవడం మొదలవుతుంది.
ఎన్‌ఎంఆర్ (ఎన్ ఎంఆర్) పరీక్ష: ఇది తేనె స్వచ్ఛతను పరీక్షించడానికి అత్యంత ప్రభావవంతమైన శాస్త్రీయ పద్ధతి. ఈ పరీక్ష ద్వారా తేనెలో షుగర్ సిరప్ కలిపి ఉందో లేదో కచ్చితంగా తెలుసుకోవచ్చు.
శుద్ధమైన తేనె ఎందుకు ముఖ్యం..?
తేనె రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, కల్తీ తేనె మన శరీరానికి హాని కలిగిస్తుంది. అందుకే, తేనె కొనేటప్పుడు దాని నాణ్యతను పరీక్షించుకోవడం, నమ్మకమైన బ్రాండ్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
