Pregnant Women : గర్భిణులు పెయిన్‌ కిల్లర్స్‌ ఎందుకు వేసుకోకూడదు..? పూర్తి వివరాలు ఇవే..!

షేర్ చేయండి:
Pregnant Women : గర్భిణులు పెయిన్‌ కిల్లర్స్‌ ఎందుకు వేసుకోకూడదు..? పూర్తి వివరాలు ఇవే..!

సాక్షి లైఫ్: గర్భధారణ సమయంలో మహిళలు కొన్ని రకాల మందులు వేసుకోవడం సురక్షితం కాదని వైద్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా నొప్పి నివారణ మందుల (Pain Killers) విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ, ప్రెగ్నెన్సీ టైమ్‌లో పెయిన్‌ కిల్లర్స్‌ను ఎందుకు వాడకూడదు..? జ్వరం వచ్చినా, ఒళ్లు నొప్పులు వచ్చినా డోలో లాంటి మందులు వేసుకోవడం సురక్షితమేనా? తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

గర్భిణులుగా ఉన్నప్పుడు అనేకమందిలో ఏదో ఒక రకమైన నొప్పి (Pain) కనిపిస్తూ ఉంటుంది. నొప్పి రకం, దాని తీవ్రతను అంచనా వేసి, వైద్య నిపుణుల పర్యవేక్షణలో మందులు లేదా వ్యాయామాలు, ఫిజియోథెరపీ వంటివి సూచించడం జరుగుతుంది.

ఏ మందులు అస్సలు వాడకూడదంటే..?

NSAIDs (నాన్-స్టెరాయిడల్ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్) డ్రగ్ ఫ్యామిలీకి చెందిన కొన్ని మందులను గర్భధారణ సమయంలో అస్సలు వాడకూడదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో బ్రుఫెన్ (Brufen), నాప్రోక్సెన్ (Naproxen), డైక్లోఫెనాక్ (Diclofenac) లాంటి మందులు ఉన్నాయి.

ముఖ్యంగా, ఏడు నుంచి తొమ్మిది నెలల మధ్య (చివరి త్రైమాసికం) ఈ మందులు వాడటం తల్లికి, బిడ్డకు తీవ్ర ప్రమాదం.

సురక్షితమైన మందులు ఏవి..?

పారాసిటమాల్ (Paracetamol) కలిగిన డోలో, కాల్‌పాల్, క్రోసిన్‌ వంటి మందులను వైద్యుల సలహా మేరకు తీసుకోవచ్చు. సాధారణ ఒళ్లు నొప్పులు, జ్వరాన్ని తగ్గించడానికి పారాసిటమాల్ సురక్షితమని అధ్యయనాల్లో తేలింది.

గర్భం 30 వారాలు దాటిన తర్వాత, పారాసిటమాల్‌తో సహా ఎలాంటి పెయిన్ కిల్లర్స్‌ను కూడా వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడకపోవడమే మంచిది.

నొప్పి తీవ్రంగా ఉంటే...

సాధారణం నుంచి ఓ మోస్తరు నొప్పి ఉన్నప్పుడు లోతైన శ్వాస వ్యాయామాలు (Deep Breathing Techniques), వేడి లేదా ఐస్ కాపడాలు వంటి సాంత్వన పద్ధతులు ఉపయోగపడతాయి. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే...

మార్ఫిన్ (Morphine), ట్రామడాల్ (Tramadol) లాంటి ఒపియేట్స్ (Opiates) పెయిన్‌ కిల్లర్స్‌ను వైద్యులు చాలా అరుదుగా, అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే సూచిస్తారు. ఇవి కేవలం లేబర్ పెయిన్‌ను ఓర్చుకోగల ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. వీటిని డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ పైనే వాడాలి.

కొంతమందిలో వచ్చే నరాల నొప్పి (Nerve Pain)కి కూడా పారాసిటమాల్‌ ను లేదా అమిట్రిప్టిలైన్ (Amitriptyline) వంటి మందులను కొన్ని రోజులపాటు ఇస్తారు.

గమనిక: గర్భిణులు తమ ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా, అది తప్పనిసరిగా నిపుణులైన గైనకాలజిస్ట్ లేదా ఆబ్‌స్టెట్రీషియన్ పర్యవేక్షణలోనే ఉండాలి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య సలహా కోసం డాక్టర్‌ను సంప్రదించండి.

ఇది కూడా చదవండి.. డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..? 

ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..? 

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.