దోమల జీవితకాలం ఎంతో తెలుసా..?  

సాక్షి లైఫ్ : ఆడ దోమలు ఒకేసారి 300 గుడ్లు పెడతాయి. దోమల జీవితకాలం రెండు నెలల కన్నా తక్కువ. మగ దోమలు 10 రోజులు మాత్రమే జీవిస్తాయి. ఆడ దోమలు 6 నుంచి 8 వారాల వరకు జీవిస్తాయి. దోమలకు దంతాలు ఉండవు, కాబట్టి అవి నోటిలోని పదునైన స్ట్రా లాంటి  పొడవైన తొండంతో కుట్టడం ద్వారా మనిషి రక్తాన్ని పీలుస్తాయి. ఒక దోమ తన బరువు కంటే మూడు రెట్లు రక్తాన్ని తాగుతుంది.

ఇది కూడా చదవండి.. అధిక ప్రోటీన్ ప్రమాదకరమా..? అధిక మోతాదు వల్ల..

ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 చెమట ఎక్కువగా పడితే దోమలు ఎక్కువగా కుడతాయి. చెమట వాసన దోమలను ఆకర్షిస్తుంది. బీర్ తాగేవాళ్లనే ఎక్కువగా దోమలు కుడతాయి. ఇతరుల కంటే బీరు తాగే వారికే ఎక్కువగా ఆకర్షితులవుతాయని పలు పరిశోధనల్లో తేలింది. దోమలకు బీరు తాగేవారినే కాదు గర్భిణులు, 'ఓ' బ్లడ్ గ్రూప్ ఉన్నవారినే ఎక్కువగా కుట్టడానికి ఇష్టపడతాయి. 

 తులసి మొక్క సువాసనకు దోమలు దగ్గరికి రావు. అంతేకాదు ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే తులసి, లెమన్ గ్రాస్ వంటి మొక్కలు పెంచుకోవాలి. వీటితోపాటు లావెండర్, బంతి పువ్వులు, వెల్లుల్లి వాసన కూడా దోమలకు నచ్చవు. నిమ్మగడ్డి వాసనకు కూడా దోమలు పారిపోతాయి.

 దోమలకు జ్ఞాపకశక్తి  ఎక్కువగా ఉంటుంది. మీరు దోమను చంపడానికి ప్రయత్నించినప్పుడు, కనీసం 24 గంటల వరకూ అది మీ చుట్టూ తిరగదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. దోమలు మనుషుల వాసనను గుర్తిస్తాయి. మిమ్మల్ని ఇంతకు ముందు కుట్టాయా..? లేదా అని మీ వాసన ద్వారా అవి గుర్తిస్తాయి.

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : physical-health mosquitoes the-most-common-cause-of-hair-loss 10-most-health-benefits-of-drinking-water facts-about-mosquitoes unknown-facts-about-mosquitoes diseases-transmitted-by-mosquitoes top-10-most-common-diseases-in-the-world dangerous-disease-transmitted-by-mosquito mosquito-borne-diseases most-common-mosquito-borne-disease 5-diseases-caused-by-mosquitoes mosquito-borne-diseases-transmited mosquitos what-diseases-do-mosquitoes-carry-in-us the-secret-life-of-mosquitoes do-you-know-female-mosquitoes do-you-know-about-male-mosquitoes how-to-get-rid-of-mosquitoes get-rid-of-mosquitoes mosquito-lifespan life-cycle-of-mosquitoes biology-of-mosquitoes how-to-get-rid-of-mosquitoes-at-home importance-of-mosquitoes life-cycle-of-a-mosquito life-cycle-of-mosquito-class life-cycle-of-mosquito-picture
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com