Vitamin C deficiency : విటమిన్ సి లోపిస్తే కనిపించే సంకేతాలను గురించి తెలుసా..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : తరచుగా అనారోగ్యం, జలుబు, దగ్గు, ఫ్లూ వంటివి తరచుగా వస్తుంటే రోగనిరోధక శక్తి బలహీనపడినట్లే. అలసట, నీరసం: కారణం లేకుండా నిరంతరం అలసిపోయినట్లు, శక్తి లేనట్లు అనిపించడం విటమిన్-సి లోపానికి సంకేతం. చిగుళ్ల సమస్యలు: చిగుళ్ల నుంచి రక్తం కారడం, వాపు, దంతాలు కదలడం వంటివి విటమిన్-సి లోపం వల్ల కావచ్చు. 

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నారా? చిన్న గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతోందా? ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా? అయితే మీ శరీరంలో విటమిన్-సి లోపం ఉండవచ్చు. ఇది మన రోగనిరోధక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన పోషకం. దీని లోపం వల్ల అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది.


చర్మం పొడిబారడం, గాయాలు మానకపోవడం: చర్మం పొడిగా మారడం, గాయాలు త్వరగా నయం కాకపోవడం విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. కీళ్ల నొప్పులు, వాపు: తీవ్రమైన సందర్భాల్లో కీళ్ల నొప్పులు, వాపు కూడా విటమిన్-సి లోపం వల్ల రావచ్చు. పొడి జుట్టు, చిట్లిన వెంట్రుకలు: ఆరోగ్యకరమైన జుట్టుకు విటమిన్-సి అవసరం. దీని లోపం జుట్టు బలహీనపడటానికి కారణమవుతుంది.

 

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.