ఫ్యాటీ లివర్ ను పెంచే మూడు పానీయాలు తెలుసా..?
సాక్షి లైఫ్ : కొవ్వు కాలేయ వ్యాధి(ఫ్యాటీ లివర్) ప్రమాదాన్ని నివారించడానికి, ప్రాసెస్ చేసిన ఆహారాలు,రెడ్ మీట్,ప్రాసెస్ చేసిన మాంసం వంటకాలు, జంక్ ఫుడ్, చక్కెర అధికంగా ఉండే ఆహారాలను వీలైనంత వరకు నివారించాలి. అంతేకాదు సోడా, కూల్ డ్రింక్స్, మద్యం, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
సోడా, సాఫ్ట్ డ్రింక్స్..
సోడాతో పాటు చక్కెర శీతల పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం అనేది కాలేయ ఆరోగ్యానికి మంచిది కాదు. సోడాలో ఉండే చక్కెర ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. ఇది కొవ్వు కాలేయానికి దారితీస్తుంద డాక్టర్లు చెబుతున్నారు.
మద్యం..
అతిగా మద్యం సేవించడం వల్ల కాలేయం ఆరోగ్యం దెబ్బతింటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇది ఫ్యాటీ లివర్ వ్యాధికి కూడా కారణమవుతుంది. కాబట్టి ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించడం ఉత్తమం.
స్పోర్ట్స్ డ్రింక్స్ ,ఎనర్జీ డ్రింక్స్..
స్పోర్ట్స్ డ్రింక్స్ ,ఎనర్జీ డ్రింక్స్ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలాంటి డ్రింక్స్ ఆరోగ్యానికి కూడా హానికరమేనని వెల్లడిస్తున్నారు వైద్యనిపుణులు.
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ఇది కూడా చదవండి..హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
