Five White Foods : మీ కిచెన్ లోని ఈ ఐదు రకాల తెల్లని పదార్థాలు సైలెంట్ కిల్లర్లలా మారుతున్నాయంటున్న డాక్టర్లు..!
సాక్షి లైఫ్ : ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గుండెపోటు కేసులు యువతలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. మన ఆరోగ్యం మనం తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వంటగదిలో నిత్యం వాడే ఐదు రకాల తెల్లని పదార్థాలు గుండెకు సైలెంట్ కిల్లర్లలా మారుతున్నాయని ప్రముఖ కార్డియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఆ పదార్థాలు ఏవి..? వాటికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. తెల్ల చక్కెర (White Sugar)..
చక్కెర కేవలం రుచికే తప్ప, శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు. ఇది ఇన్సులిన్ స్థాయిలను అస్తవ్యస్తం చేయడమే కాకుండా, పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రత్యామ్నాయం ఏమిటంటే..? బెల్లం, తాటి బెల్లం, పచ్చి తేనె, ఖర్జూరాలు లేదా కొబ్బరి చక్కెర వాడటం ఉత్తమం.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
2. మైదా పిండి (Refined Flour)..
గోధుమల నుంచి పీచు పదార్థాన్ని పూర్తిగా తొలగించి మైదాను తయారు చేస్తారు. ఇందులో పోషక విలువలు సున్నా. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, గుండెపై ఒత్తిడిని పెంచుతుంది.ప్రత్యామ్నాయం ఏమిటంటే..? జొన్నలు, రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాల పిండి లేదా పొట్టు తీయని గోధుమ పిండిని ఎంచుకోండి.
3. శుద్ధి చేసిన ఉప్పు (Refined Salt)..
సాధారణంగా వాడే టేబుల్ సాల్ట్ తయారీలో సహజ ఖనిజాలను తొలగించి కొన్ని రకాల రసాయనాలను కలుపుతారు. ఇది రక్తపోటు (BP) పెరగడానికి ప్రధాన కారణం.ప్రత్యామ్నాయం ఏమిటంటే..? సైంధవ లవణం (రాక్ సాల్ట్), హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా సహజంగా ఎండబెట్టిన సముద్రపు ఉప్పును పరిమితంగా వాడాలి.
4. రిఫైన్డ్ ఆయిల్ (Refined Oil)..
రసాయన ప్రక్రియల ద్వారా వెలికితీసే శుద్ధి చేసిన నూనెలు శరీరంలో వాపు (Inflammation) కలిగిస్తాయి. ఇవి ధమనుల్లో అడ్డంకులకు కారణమవుతాయి. ప్రత్యామ్నాయం ఏమిటంటే..? గానుగ నూనెలు (కోల్డ్ ప్రెస్డ్) వాడటం శ్రేయస్కరం. వేరుశనగ, ఆవ నూనె, కొబ్బరి నూనె, నెయ్యి లేదా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌ను వాడవచ్చు.
5. పాలిష్ చేసిన బియ్యం (Polished White Rice)..
చూడటానికి తెల్లగా మెరిసిపోయే బియ్యంలో పోషకాలు తక్కువ, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. ఇది బరువు పెరగడానికి, మధుమేహానికి దారితీస్తుంది. ప్రత్యామ్నాయం ఏమిటంటే..? దంపుడు బియ్యం (Hand-pounded rice), బ్రౌన్ రైస్, ఎర్ర బియ్యం లేదా చిరుధాన్యాలు (millets) తీసుకోవడం ఆరోగ్యకరం. మీ ఆహారంలో చేసే చిన్న మార్పులే మీ గుండెను పదికాలాల పాటు పదిలంగా ఉంచుతాయి. అనారోగ్యకరమైన ఆహారానికి స్వస్తి చెప్పి, ప్రకృతి సిద్ధమైన పోషకాలను ఆహ్వానించండి..!
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
