అలోవెరా జెల్ రాయడం వల్ల మొటిమలు రాకుండా ఉంటాయా..?  

షేర్ చేయండి:
అలోవెరా జెల్ రాయడం వల్ల మొటిమలు రాకుండా ఉంటాయా..?  

సాక్షి లైఫ్ : ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది : అలోవెరా జెల్‌లో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమల వల్ల వచ్చే ఎరుపు, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు: అలోవెరాలో మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నిరోధించే గుణాలు ఉన్నాయి. దీనివల్ల కొత్త మొటిమలు రాకుండా నిరోధించడానికి అలోవెరా ఉపయోగపడుతుంది.  

ఇది కూడా చదవండి..విటమిన్ "డి"ని ఎలాంటి ఫుడ్స్ ద్వారా పొందవచ్చు..? 

ఇది కూడా చదవండి.. Immunotherapy : ఇమ్యునోథెరపీ ఎలా పనిచేస్తుంది..?

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

 చర్మపు మచ్చలను నిర్మూలించడానికి ,వయస్సు రీత్యా వచ్చే ముడతలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.

 అలోవెరా జెల్‌లో యాంటీ బాక్టీరియల్స్ ,యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

 ఇలా చేయడంవల్ల మొటిమలుతగ్గి, చర్మం మృదువుగా మారుతుంది.

అలోవెరా జెల్‌ని ముక్కుపై సున్నితంగా మసాజ్ చేయండి.
 
ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కొన్నాళ్లకు మచ్చలుపోతాయి.
 
 అలోవెరా జెల్ ముఖంపై మొటిమలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 

గాయాలను నయం చేస్తుంది: అలోవెరా జెల్ చర్మంపై ఏర్పడిన మొటిమల మచ్చలు, గాయాలను త్వరగా నయం చేయడానికి సహాయపడుతుంది.

అయితే, అలోవెరా జెల్ అందరి చర్మానికి ఒకేలా పని చేయకపోవచ్చు. కొందరికి ఇది చికాకు లేదా అలర్జీని కలిగించవచ్చు. అలోవెరా జెల్‌ని ముఖంపై నేరుగా రాసే ముందు, మీ చేతిపైన లేదా చెవి వెనుక భాగంలో కొద్దిగా రాసి, ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది.

మొటిమలకు శాశ్వత పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే, చర్మ వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. వారి సలహా ప్రకారం చికిత్స తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ఇది కూడా చదవండి..పిల్లలలో టైప్-2 డయాబెటీస్‌ కు ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..సీతాఫలం తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.